Krithi Shetty| కృతి శెట్టికి బర్త్ డే గ్రీటింగ్స్
కన్నడ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి 2003 సెప్టెంబర్ 21న జన్మించింది. కృతి శెట్టి ఆదివారం తన జన్మదిన వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు తమిళ సినిమా వావ్ వాథియర్ చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

విధాత : కన్నడ బ్యూటీ హీరోయిన్ కృతి శెట్టి ( Krithi Shetty) సోషల్ మీడియాలో తన అందాల ఫోటోలతో అభిమానులకు తన బర్త్ డే సందర్భంగా హాట్ ట్రీట్ ఇచ్చింది. 2003 సెప్టెంబర్ 21న జన్మించిన కన్నడ భామ కృతిశెట్టి ఆదివారం తన జన్మదిన వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు తమిళ సినిమా వావ్ వాథియర్ చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తుంది .ప్రదీప్ రంగనాథ్ జోడిగా చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా తాజాగా విడుదలైంది. తమిళంలోనే కార్తీతో వావ్ వాథియర్ లో, రవి మోహన్ సరసన మరో సినిమాలో నటిస్తుంది.
టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. తర్వాత తెలుగులో ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుల సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ చిన్నది.. నెమ్మదిగా వరుస డిజాస్టర్స్ అందుకుని తెలుగులో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేకుండా తమిళంలో బిజీగా మారిపోయింది.