NBK 111 : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో నయనతార ఫిక్స్
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే NBK 111 సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఖరారైంది. నవంబర్ 7న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
విధాత : లేడి సూపర్ స్టార్ నయన తార టాలీవుడ్ లో మరోసారి సినీయర్ హీరోల పక్కన తళుక్కుమంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుకుంటున్న మన శంకర్ వరప్రసాద్ గారు..వస్తున్నారు సినిమాలో చిరు సరసన జతకట్టిన నయనతార టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. నవంబర్ 7 న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎన్.బి.కె 111 సినిమా కూడా గోపీచంద్ మార్క్ మూవీగా ఉండే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి కొనసాగనుంది. హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ కథతో ఈ సినిమా రానుందని సమాచారం. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్ లో గతంలో వీరసింహా రెడ్డి వంటి హిట్ సినిమా చేశారు.
ఇకపోతే బాలకృష్ణతో నయనతార బాక్సాఫిస్ హిట్ సింహా సినిమాతో పాటు జయసింహా, శ్రీరామ రాజ్యం సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత నర్తనశాల అనే సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మధ్యలో ఆగిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ బాలకృష్ణతో నయనతార హిస్టారికల్ మూవీతో రాబోతున్నారు. సినిమాలో బాలయ్య, నయనతారలు మహారాజు, మహారాణి పాత్రల్లో కనిపిస్తారని టాక్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram