కొత్త ‘మెగా ’ లుక్
విధాత: కొత్త లుక్ లో కనిపించి మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను అలరించారు. దెయ్యం గెటప్లో థ్రిల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ ఆయన మూవీకి సంబంధించినది కాదు. అక్టోబర్ 31వ తేదీన పాశ్చాత్య దేశాలు హాలోవీన్ డేను జరుపుకుంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకను ఇప్పుడు సరదాగా జరుపు కుంటున్నారు. ఈ సందర్భంగా వారు దెయ్యం […]

విధాత: కొత్త లుక్ లో కనిపించి మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను అలరించారు. దెయ్యం గెటప్లో థ్రిల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ ఆయన మూవీకి సంబంధించినది కాదు.
అక్టోబర్ 31వ తేదీన పాశ్చాత్య దేశాలు హాలోవీన్ డేను జరుపుకుంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకను ఇప్పుడు సరదాగా జరుపు కుంటున్నారు.
ఈ సందర్భంగా వారు దెయ్యం గెటప్ వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. చిరు కూడా దెయ్యం గెటప్ లో కనిపించారు. ఓ యాప్ ఉపయోగించి వీడియోను తీశారు. ‘హ్యావ్ ఏ థ్రిల్లింగ్ డే’ అని కామెంట్ చేశారు. ఇది చూసి అభిమానులు థ్రిల్ ఫీలవుతున్నారు.