Kalki 2898 AD | నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అంటూ పోస్టు చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు ప్రభాస్ తెరదించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆసక్తి రెకెత్తించే వీడియోను ప్రభాస్ ఆఫీషియల్‌గా విడుదల చేశారు.
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ ( Kalki 2898 AD )సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. నిన్న ప్రభాస్ చేసిన ఒక పోస్టుతో ఆ మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. కల్కీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి అని ప్రభాస్ పోస్టు చేసేసరికి అభిమానుల్లో ఒక ఉత్కంఠ నెలకొంది. పెళ్లి గురించా..? కల్కీ అప్డేట్ గురించా..? అని ఎవరికి వారు జోరుగా చర్చించుకున్నారు. మెజార్టీ అభిమానులు మాత్రం కల్కి అప్డేటే అయి ఉండొచ్చని ఊహించారు. ఈ ఊహాగానాలు కొనసాగుతుండగానే మళ్లీ ప్రభాస్ మరో పోస్టు చేశారు. నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అంటూ పోస్టు చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు ప్రభాస్ తెరదించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆసక్తి రెకెత్తించే వీడియోను ప్రభాస్ ఆఫీషియల్‌గా విడుదల చేశారు.
కల్కి సినిమాలో భాగమైన బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా ఉన్న ఈ వీడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తు ఉంటారు. బుజ్జికి వాయిస్‌ను కీర్తి సురేశ్ ఇచ్చింది. నా లైఫ్ ఏంటీ..? బాడీ లేకుండానే బతికేయాల్సిందేనా..? అంటూ బుజ్జి చెబుతుండగా, ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి నీ టైమ్ మొదలైంది బుజ్జి అంటూ ఒక వెహికల్‌ను రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జూన్ 22వ తేదీ వరకు ఆగాల్సిందేనని తెలిపారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా కల్కి విడుదల కానుంది.
Presenting ‘𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji‘ from #Kalki2898AD!!!https://t.co/PwgcOBfJcf @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/tfmW7EtYiF
— Kalki 2898 AD (@Kalki2898AD) May 18, 2024