Pavitra jayaram| పవిత్ర-చందు గురించి తప్పుడు ప్రచారాలు.. అలా మాట్లాడొద్దు అంటూ పవిత్ర కూతురు కామెంట్స్
Pavitra jayaram| త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్.. కారు యాక్సిడెంట్‌లో మృతి చెందగా, ఆమె మృతి మరచిపోకముందే సీరియల్ నటుడు చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉండగా, పవిత్ర చనిపోయిన నాటి నుంచి
Pavitra jayaram| త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్.. కారు యాక్సిడెంట్‌లో మృతి చెందగా, ఆమె మృతి మరచిపోకముందే సీరియల్ నటుడు చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఇద్దరు ప్రేమలో ఉండగా, పవిత్ర చనిపోయిన నాటి నుంచి చంద్రకాంత్ డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆమె మృతిని జీర్ణించుకోలేక సొషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వచ్చాడు. ఒక పోస్ట్‌లో చంద్రకాంత్.. రెండు రోజులు ఆగు అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ తర్వాత కొందరు అతనికి ధైర్యం అందించారు. తీరా చూస్తే అతను పోస్ట్‌లో రాసినట్టుగానే పవిత్ర చనిపోయిన రెండు రోజులకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే పవిత్ర- చంద్రకాంత్ మరణం తర్వాత వారికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రకాంత్ మరణం తర్వాత ఆయన భార్య శిల్ప చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తీవ్రమైన డిప్రెషన్‌తోనే తన భర్త చనిపోయాడని , కొన్నిరోజులు ఆగితే అన్నీ కుదుటపడతాయని చెప్పినా కూడా వినలేదని చందు కుటుంబ సభ్యులు అంటున్నారు. చంద్రకాంత్ జీవితం ఇలా కావడానికి కారణం ఒకరకంగా పవిత్రనే కారణం అంటూ చంద్రకాంత్ భార్య శిల్ప, ఆయన తల్లి అన్నారు. అయితే తన తల్లికి సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో పవిత్రా కూతురు స్పందించింది.
పవిత్రా జయరాం- చంద్రకాంత్ మంచి స్నేహితులని ఆమె చెప్పుకొచ్చింది. చందు- తన తల్లి పవిత్రల బంధం గురించి తప్పుగా మాట్లాడద్దు అంటూ అందరికీ విజ్ఞప్తి చేసింది. తనతో కూడా చందు తరచూ ఫోన్లో మాట్లాడేవాడని, మంచిగా చదువుకోవాలని సూచనలు చేసేవాడని, నన్ను చాలా ఎంకరేజ్ కూడా చేసేవాడంటూ పేర్కొంది. నా తల్లి అంత్యక్రియలకి కూడా ఆయన హాజరయ్యారు. దయచేసి వారిద్దరి గురించి తప్పుగా ఎవరు మాట్లాడొద్దు అంటూ పవిత్ర కూతురు కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే.. చందుకు 2015లోనే పెళ్లి జరిగింది. 2015లో శిల్ప అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram