Prabhas|ప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌డి ఆ ఇద్ద‌రు తెలుగు హీరోయిన్స్ ఒంట‌రిగా జీవిస్తున్నారా..!

Prabhas|డార్లింగ్ ప్ర‌భాస్ 44వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌గా ఉన్న‌ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. కెరీర్‌లో ఉన్న‌త స్థానానికి ఎదిగిన ప్ర‌భాస్ బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ప్ర‌స్తుతం ప్ర‌భా

  • By: sn    cinema    Oct 23, 2024 10:50 AM IST
Prabhas|ప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌డి ఆ ఇద్ద‌రు తెలుగు హీరోయిన్స్ ఒంట‌రిగా జీవిస్తున్నారా..!

Prabhas|డార్లింగ్ ప్ర‌భాస్(Prabhas) 44వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌గా ఉన్న‌ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. కెరీర్‌లో ఉన్న‌త స్థానానికి ఎదిగిన ప్ర‌భాస్ బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌కి తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అందుకే ప్రభాస్ సినిమాలకు పెట్టుబడి విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. 2024లో ప్రభాస్ రెండు భారీ హిట్‌లు అందుకోగా, ఇందులో సలార్‌(Salar)తో ప్రపంచవ్యాప్తంగా రూ.618 కోట్లు రాబట్టాడు.

ఇక ‘కల్కి 2898 ఏడీ’తో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1042.25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మరో ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ కలిపి రూ.2,100 కోట్లు పైగానే ఉండొచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab)చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తవగానే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తాడు. అయితే, ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. ఒకట్రెండు టాక్ షోలలో మాత్ర‌మే కనిపించిన ప్రభాస్, ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ నీ ఉచ్ఛ్వాసం కవనం అనే టీవీ షోలో పాల్గొన్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్‌(Prabhas)కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్రభాస్ ను ప్రేమించి 40 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోకుండా ఉన్నా హీరోయిన్స్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ డిస్క‌షన్ న‌డుస్తుంది. అనుష్క, త్రిష. ప్రభాస్ తో క‌లిసి న‌టించి మంచి హిట్స్ కొట్టారు. త్రిషతో ప్ర‌భాస్ పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడులో నటిస్తే.. అనుష్కతో బిల్లా, మిర్చీ, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేప్పుడు వారిద్ద‌రి జంట బాగుంద‌ని, పెళ్లి చేసుకుంటే బాగుండ‌ని ఫ్యాన్స్ అనుకున్నారు. త్రిష .. ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇక అనుష్క , ప్రభాస్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారని ఇంట్లోవాళ్ళు ఒప్పుకోక‌పోవ‌డంతో వారి వివాహం జ‌ర‌గ‌లేద‌నే టాక్ కొన్నాళ్లుగా న‌డుస్తుంది.