Bahubali The Epic | ‘బాహుబలి: ది ఎపిక్’ టీజర్ విడుదల
బాహుబలి: ది ఎపిక్ టీజర్ రిలీజ్; ప్రభాస్, అనుష్క, రాజమౌళి పర్యవేక్షణలో అక్టోబర్ 31న సెన్సేషన్

విధాత : తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి 1, 2సినిమాలు విడుదలై 10ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా రెండు భాగాలను ఒకే సినిమాగా మేకర్స్ ‘బాహుబలి: ది ఎపిక్’(Bahubali: The Epic) పేరుతో మరోసారి ఆక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి పర్యవేక్షణలో ‘బాహుబలి: ది ఎపిక్’కు సంబంధించిన విడుదల సన్నాహక పనులు కొనసాగుతున్నాయి.
ప్రభాస్ (Prabhas), అనుష్క (Anushka), తమన్నా (Tamannaah), రానా(Rana), రమ్యకృష్ణ (Ramya Krishna), నాజర్ (Nasser), సత్యరాజ్ (Sathyaraj) లు నటించిన బాహుబలి దీ ఎపిక్ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం సన్నద్దమవుతుంది. త్వరలోనే నటీనటులు, దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు. అందులో ప్రధానంగా టాలీవుడ్ క్రేజీ జంట ప్రభాస్ అనుష్కలు పదేళ్ల తర్వాతా ఒకే వేదిక పంచుకోనుండటంతో అభిమానులు ఆ సన్నివేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.