Prabhas| త‌న జీవితంలోకి స్పెష‌ల్ ప‌ర్సన్ రాబోతున్నాడంటూ ప్ర‌భాస్ పోస్ట్.. పెళ్లి గురించేనా?

Prabhas| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఆయ‌న పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ వయసు 44 ఏళ్లు. ఆయ‌న ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఇక ఆయ‌న పెళ్లిపై వ‌చ్చే రూమ‌ర్స్ కి లెక్కే లేదు. అనుష్క దగ్గరి నుం

  • By: sn    cinema    May 17, 2024 11:31 AM IST
Prabhas| త‌న జీవితంలోకి స్పెష‌ల్ ప‌ర్సన్ రాబోతున్నాడంటూ ప్ర‌భాస్ పోస్ట్.. పెళ్లి గురించేనా?

Prabhas| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఆయ‌న పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ వయసు 44 ఏళ్లు. ఆయ‌న ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఇక ఆయ‌న పెళ్లిపై వ‌చ్చే రూమ‌ర్స్ కి లెక్కే లేదు. అనుష్క దగ్గరి నుంచి కృతి సనన్ వరకూ ఇలా చాలా మంది హీరోయిన్స్‌తో ప్ర‌భాస్ పెళ్లి అంటూ పుకార్లు పుట్టించారు. అయితే ఎన్ని రూమ‌ర్స్ వ‌చ్చిన కూడా ప్ర‌భాస్ మాత్రం ఏ నాడు కూడా త‌న పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇవ్వ‌లేదు. అదుగో ఇదుగో అంటున్నాడే త‌ప్ప పెళ్లి గురించి ఏ విష‌యం చెప్ప‌డం లేదు.

అయితే ప్రభాస్ తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌భాస్ తన ఇన్‌స్టా స్టోరీలో డార్లింగ్స్.. ఓ ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి’ అంటూ ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఓ స్టేటస్ పెట్టారు. ఇది చూడబోతే.. పెళ్లి గురించేమో అన్న అనుమానం అంద‌రిలో క‌లుగుతుంది. అభిమానులు కూడా ప్ర‌భాస్ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కాని ఇందులో ట్విస్ట్ కూడా లేక‌పోలేదు. ప్ర‌భాస్ మ‌నలైఫ్ అన్నాడు, పెళ్లి అయితే త‌న లైఫ్ అని అనేవాడు.

ఏదైన కొత్త సినిమా గురించి ప్రభాస్ అప్‌డేట్ ఇస్తాడేమోన‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం క‌ల్కి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 AD మూవీని జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ రూపొందుతుంది. ఇక మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు డార్లింగ్. అలాగే కన్నప్పలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవే కాకుండా సలార్ 2 షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ,హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయ‌నున్నాడు ప్ర‌భాస్.