Pranitha Subash| సెకండ్ రౌండ్.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ప‌ట్ట‌వంటూ ప‌వ‌న్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ విష‌యం రివీల్ చేసిందిగా..!

Pranitha Subash|  ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సంసార జీవితంలో సంతోషంగా ఉంటున్నారు. వారి పర్స‌న‌ల్ లైఫ్ అప్‌డేట్స్‌ని సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ప్ర‌ణీత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసింది. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించి ‘బాపు బొమ్మ’ గా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకు

  • By: sn    cinema    Jul 26, 2024 7:20 AM IST
Pranitha Subash| సెకండ్ రౌండ్.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ప‌ట్ట‌వంటూ ప‌వ‌న్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ విష‌యం రివీల్ చేసిందిగా..!

Pranitha Subash|  ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సంసార జీవితంలో సంతోషంగా ఉంటున్నారు. వారి పర్స‌న‌ల్ లైఫ్ అప్‌డేట్స్‌ని సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ప్ర‌ణీత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసింది. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించి ‘బాపు బొమ్మ’ గా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండో సారి అమ్మ గా ప్రమోషన్ పొందనున్న‌ట్టు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. త‌న బేబి బంప్ ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘రౌండ్ 2… ఇక నుంచి ప్యాంట్‌లు సరిపోవు’ అంటూ చ‌మ‌త్కరిస్తూ కామెంట్ చేసింది.

ప్ర‌ణీత బేబి బంప్ పిక్స్‌పై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప‌లువురు సెల‌బ్రిటీలు ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రణీత సుభాష్ బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021 మే 30వ తేదీన వివాహం చేసుకుంది.. కోవిడ్‌ కారణంగా అప్పట్లో వాళ్ల పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. త‌మ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ని ప్ర‌ణీత సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక ప్రణీత- నితిన్ రాజు దంపతులకు2022లో మొదటి బిడ్డ జన్మనిచ్చింది. ఆ ఆ పాపకు అర్నా అని పేరు పెట్ట‌గా, ఇప్పుడు మరో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్ర‌ణీత గ‌త నెల‌లోనే తన భర్త నితిన్ రాజుకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె ఓ పోస్ట్ చేసింది. ఇందులో ప్రణీత బేబీ బంప్ ను గమనించిన నెటిజ‌న్స్ అప్పుడే తాను ప్ర‌గ్నెంట్ అని చెప్పారు. ఆ ఫొటోల్లో బేబి బంప‌ర్ కవర్ చేయడానికి ప్ర‌ణీత ఎంత ప్ర‌య‌త్నించిన కూడా కొంద‌రు మాత్రం క‌నిపెట్టేశారు.. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అని కొందరు ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. పెళ్లి తర్వాత రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ ఏడాదే మళ్లీ షూటింగులు మొదలుపెట్టింది.ఇప్పుడు తిరిగి ప్ర‌గ్నెంట్ కావ‌డంతో మ‌ళ్లీ త‌న కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇవ్వ‌నుంది.