Deepika Padukone| దీపికా ప‌దుకొణేకి సీమంతం వేడుక‌.. నిజ‌మైన ఫోటోలేనా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Deepika Padukone| భారతీయ నటిగా, నిర్మాతగా, భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒక‌రు దీపికా ప‌దుకొణే. దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన జాబితాలో కూడా దీపికా ఆరోస్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ లోనూ నటించిన ఈ అమ్మడు 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.అయితే దీపికా ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం తెలిసిం

  • By: sn    cinema    Aug 01, 2024 6:44 AM IST
Deepika Padukone| దీపికా ప‌దుకొణేకి సీమంతం వేడుక‌.. నిజ‌మైన ఫోటోలేనా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Deepika Padukone| భారతీయ నటిగా, నిర్మాతగా, భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒక‌రు దీపికా ప‌దుకొణే. దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన జాబితాలో కూడా దీపికా ఆరోస్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ లోనూ నటించిన ఈ అమ్మడు 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.అయితే దీపికా ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం తెలిసిందే. ఆమె తల్లి కావడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జ్యోతిష్యులు ఇప్పటికే ఆమె మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిస్తుంద‌ని చెప్పారు. తను గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా నటి తను నటిస్తున్న సినిమాలన్నింటి షూటింగ్‌లకి కూడా దూరంగా ఉంది.

అయితే దీపికాకి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీపికాకి కుటుంబ సభ్యులు సంప్రదాయ బద్ధంగా సీమంతం వేడుక నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఫోటోలు అసలైనవా లేక నకిలీవా అన్న‌దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక గర్భం దాల్చిన తర్వాత ఆడపిల్లలు బరువు పెరగడం స‌హ‌జం. కానీ దీపిక మాత్రం.. కాస్త పోట్ట ముందుకు రావడం తప్ప‌, త‌న ఫిజిక్‌లో ఎలాంటి మార్పుతో క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు దీపికా ప్ర‌గ్నెంటా, లేకుండా స‌రోగ‌సి ద్వారా బిడ్డని కంటుందా అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

రణవీర్ సింగ్ మరియు దీపిక 25 జూలై 2019 న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. పెళ్లయి దాదాపు 5 ఏళ్లు గడిచినా ఆ దంపతులు పిల్ల‌లు క‌నాల‌నే ప్లాన్ చేయ‌లేదు. సినిమా బిజీ వ‌ల‌న దీపికా తన ప్రెగ్నెన్సీని వాయిదా వేసినప్పటికీ, ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించింది.ఈ మ‌ధ్య కాలంలో దీపికా మంచి విజ‌యాలే అందుకుంది. పఠాన్, జవాన్, ఫైటర్, కల్కి లాంటి పెద్ద సినిమాలు త‌న ఖాతాలో వేసుకొని అద‌ర‌హో అనిపించింది. మ‌రి పిల్ల‌లు పుట్టాక దీపికా సినిమాలు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్పటికే అన్ని సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదని తెలుస్తోంది.