Naini Rajender Reddy : బీ ఆర్ ఎస్ కు ప్రతీది రాజకీయమే

పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, తాటికొండ రాజయ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు ప్రతీదీ రాజకీయంగా మారిందని, ఇలాగే వ్యవహరిస్తే ఆ పార్టీ దుకాణం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Naini Rajender Reddy : బీ ఆర్ ఎస్ కు ప్రతీది రాజకీయమే

బీఆర్ఎస్ నాయకులకు ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటుగా మారిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాదులో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య విషయంలో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, తాటికొండ రాజయ్యలు మాట్లాడిన తీరుపై విమర్శించారు. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులకు బుద్ధిరాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే ఆ పార్టీ దుకాణం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే డిపాజిట్లు దక్కలేదని, రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనీస డిపాజిట్ తెచ్చుకోలేరని ఎద్దేవా చేశారు.

హనుమకొండలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పదవి నుంచి ఎందుకు తీసేసారో ఇప్పటికీ తెలియని తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రాజయ్యను భర్త రఫ్ చేసిన విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వ్యవస్థలో గౌరవం లేకుండా,అభద్రత భావాన్ని కలిగించేలా చేశారు. ప్రమోద్ అనే కానిస్టేబుల్ మృతి పట్ల రాజకీయం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఉద్యమం సమయంలో శవాల పై పేలాలు ఏరుకున్న ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బిడ్డ అయినా నిన్ను మంత్రి వర్గం నుండి తొలగిస్తే ఎవరూ స్పందించిన దాఖలాలు లేవన్నారు. చివరికి తామే ప్రశించామన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.