Prasanth Varma| టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కెరీర్లో మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఆయన రీసెంట్గా చేసిన హనుమాన్ మూవీ ఎంత పె
Prasanth Varma| టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కెరీర్లో మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఆయన రీసెంట్గా చేసిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం. త్వరలో హనుమాన్ సీక్వెల్‌తో పలకరించబోతున్నాడు. అయితే హనుమాన్ సినిమాతో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసాడు ప్రశాంత్ వర్మ. రానున్న 20 ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు పలకరించనున్నాయి. ఇక ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితం కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది.
ఈ వేడుకలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తను ఒక సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని, దానిని పెద్ద బాధ్యతగా తీసుకుంటానని అన్నారు. ఇక సినిమాటిక్ యూనివర్స్ అనేది ఎన్నో ఏళ్ల కల కాగా, ఈ యూనివర్స్‌తో తాను ప్రయాణించబోతున్నట్టు తెలిపాడు. అలానే హనుమాన్ సినిమాలో చూసిన క్యారెక్టర్స్ రానున్న సినిమాలలోను కనిపించనున్నాయట. ఈ యూనివర్స్‌లో కొత్త వారిని పరిచయం చేస్తాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులని ఎంపిక చేస్తాము అని అన్నారు. ఇక ప్రస్తుతం ‘జై హనుమాన్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతుంది. ఈ మూవీలో హనుమాన్ రోల్ ని ఎవరు పోషిస్తున్నారనే ఆసక్తి అందరిలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ పాత్రని పోషిస్తారంటూ ప్రచారాలు సాగగా, దానిపై ఇన్‌డైరెక్ట్‌గా ఓ హింట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. “మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే. నా పైన నమ్మకం పెట్టుకోండి, మీరు అనుకున్న స్థాయిలోనే సీక్వెల్ ఉంటుంది. అలానే ప్రతి పాజిటివ్, నెగెటివ్ కామెంట్‌ని కూడా చదువుతున్నా. వాటిని దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తాడు. అని అన్నారు. అయితే ప్రశాంత్ వర్ ఇచ్చిన చిన్న క్లూతో హనుమాన్ పాత్రని చిరంజీవే పోషిస్తారని అందరికి ఒక క్లారిటీ వచ్చింది.