SKN Counter To Deepika Padukone | దీపిక పదుకుణేకు నిర్మాత ఎస్ కే ఎన్ కౌంటర్

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్ కే ఎన్ రష్మిక మందానా సమర్ధనతో దీపికా పదుకుణేకు చురకలు అల్లు అరవింద్ ప్రత్యేక ప్రశంసలు తెలిపారు.

SKN Counter To Deepika Padukone | దీపిక పదుకుణేకు నిర్మాత ఎస్ కే ఎన్ కౌంటర్

విధాత, హైదరాబాద్ : రష్మికా మందానా, దీక్షిత్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా స్టార్లు దీపికా పదుకుణే, రష్మిక మందానాల మధ్య వైరుద్యాలను చాటే వేదికగా మారడం హాట్ టాపిక్ గా మారింది. ఈవెంట్ లో టాలీవుడ్ నిర్మాత ఎస్ కే ఎన్ తన ప్రసంగంలో పరోక్షంగా పాన్ ఇండియా స్టార్ కమిట్మెంట్..డెడికేషన్ ఎలా ఉండాలో చెబుతూ రష్మికను పొగిడేసి..పరోక్షంగా పనిగంటలపై డిమాండ్ పెడుతున్న దీపికా పదుకుణేకు చురకలు వేయడం చర్చనీయాంశమైంది. ఎస్ కేఎన్ తన ప్రసంగంలో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో రష్మికలో చూసినంతగా.. వృత్తి పట్ల ఉన్న అంత కమిట్మెంట్.. అంత డెడికేషన్ ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఎన్ని గంటలు పని చేయాలి అనే డిబేట్ జరుగుతున్న ఈ టైమ్ లో.. ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో వన్లీ వన్ రష్మిక ఒక్కరేనంటూ కొనియాడారు. రష్మిక వర్క్ ని అవర్స్ తో చూడరని..ప్రేమతో కొలుస్తారని, ప్రేమకు టైమ్ ఉండదు.. టైమింగ్ ఒకటే తెలుసా అని అకాశానికెత్తారు. అందుకే రష్మికను అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీలవుతారు అని ప్రశంసించారు.

రష్మిక అంటే యానిమల్, పుష్ప, పుష్ప 2, థామా…అమె కెరియర్ కు ఎప్పుడు ఉండదు కామా అని ఎస్ కేఎన్ కవితాత్మకంగా పొగిడేశారు. రష్మిక గురించి ఒక మాట చెప్పాలంటే కొందరిలోలో స్వీట్ నెస్ ఉంటుందని, కొందరిలో కూల్ నెస్ ఉంటుందని, మరికొందరిలో హార్ట్ నెస్ ఉంటుందని వాటన్నింటిని కలిపితే ఎలా ఉంటుందో..పొద్దునే క్యారెట్ ఆపిల్, బీట్ రూట్ మిక్స్ చేసిన ఏబీసీ జ్యూస్ ఎలా ఉంటుందో రష్మిక అలా ఉంటుందని ఎస్ కే ఎన్ రష్మికను పొగడ్తలతో ముంచెత్తారు. ఎంత ఎదిగినా సరే ఆమె ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు.. సింప్లిసిటీ అంటూ అభినందించారు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన బేబీ సినిమాతో నిర్మాతగా ఎస్.కే.ఎన్ మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

రష్మిక లాంటి కూతురు కావాలనిపిస్తుంది : అల్లు అరవింద్

ఇదే ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ రష్మిక లాంటి కూతురు నాకు కావాలని అనిపిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు కూతుళ్లు లేరని..రష్మిక వంటి కూతురు ఉంటే బాగుండనిపిస్తుందన్నారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాలో కథను 2021లో మొదటిసారిగా వినిపించారని.. రష్మిక పోషించిన పాత్ర బరువుకు ఆమె మాత్రమే సరిపోతుందని..ఈ పాత్రను ఆమె మాత్రమే మోయగలదని..బెస్ట్ యాక్టర్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను ఆహ్వానిద్దామని తెలిపారు.