Deepika Padukone : షారుక్ నేర్పిన పాఠాలతోనే సినిమాల ఎంపిక
18 ఏళ్ల క్రితం షారుక్ నేర్పిన పాఠాలతోే దీపిక సినిమాల ఎంపిక, 'కల్కి 2898' సీక్వెల్ నుండి తప్పుకోవడం వెనక కారణం.

విధాత : ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకుణే తప్పుకోవడంతో ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా దీపిన పదుకుణే ఇన్ స్టాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్‌తో కలిసి ఆమె ఆరో సినిమా ‘కింగ్’లో నటించబోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఇదే పోస్టులో షారుక్ తనకు నేర్పిన పాఠం గురించి దీపిక ప్రస్తావించారు.
18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలే.. సినిమా విజయం కంటే ప్రాధాన్యమైన అంశాలని చెప్పారు. నేను ఆ మాటలనే పూర్తిగా నమ్ముతాను. అప్పటినుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలుచేస్తున్నాను’’ అని తెలిపారు. ఇక తాను షారుక్‌తో ఆరో సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. అయితే దీపిక కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎందుకంటే ఆమె పరోక్షంగా ‘కల్కి 2’ సినిమా నుంచి తనను తప్పించడంపైనే మాట్లాడారని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.