Latest Movie Trailers 2025 : వరుసగా మూడు సినిమాల ట్రైలర్లు..సినీ అభిమానులకు పండుగే

ధనుష్ ‘ఇడ్లి కొట్టు’, పవన్ కల్యాణ్ ‘ఓజీ’, రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్ 1’ ట్రైలర్లు వరుసగా రిలీజ్, సినీ అభిమానుల పండుగ.

Latest Movie Trailers 2025 : వరుసగా మూడు సినిమాల ట్రైలర్లు..సినీ అభిమానులకు పండుగే

విధాత : వరుసగా మూడు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు విడుదలవుతుండటం.. సినీ అభిమానులకు దసరా పండుగలా మారనుంది. ముందుగా శనివారం నటుడు ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కొట్టు సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం అక్టోబర్‌1వ తేదీన విడుదల కానుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘కుబేర’తో ఈ ఏడాది ఆయన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. దీంతో తెలుగులో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరకు ధనుష్ కెరీర్‌లో హైయ్యస్ట్ రేట్ ఇచ్చి మరీ శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు రైట్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత రామారావు చింతపల్లి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే…ఆదివారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఓజీ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది. సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ ను ఒక్కోటి రూ.లక్షకు కొనుగోలు చేసి పవన్ అభిమానులు సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

ఇకపోతే సోమవారం మధ్యాహ్నం 12:45 గంటలకు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందిన క్రేజీ ప్రాజెక్టు కాంతారా చాప్టర్ 1 సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. 2022లో విడుదలైన “కాంతార” బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో కాంతారా చాప్టర్ 1ను హోంబలే ఫిలింస్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.