Krrish 4 : హృతిక్ ‘క్రిష్ 4’ రష్మిక
హృతిక్ ‘క్రిష్ 4’లో రష్మిక మందనా హీరోయిన్; 2027లో విడుదల, పాన్ ఇండియా బడ్జెట్‌తో భారీ ప్రాజెక్ట్.

విధాత : బాలీవుడ్ లో విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ‘క్రిష్’ మూవీ ఫ్రాంచైజీలో రాబోతున్న నాల్గవ భాగంలో హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందనా ను ఎంపిక చేయనున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘క్రిష్ 4’ చిత్రంలో నటించేందుకు ఇప్పటికే రష్మికను చిత్ర బృందం సంప్రదించిందని..త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలుడనుందని బాలీవుడ్ టాక్.
‘క్రిష్ 4’ సినిమాలో రష్మిక భాగస్వామ్యమైతే సినిమా మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారనుంది. పాన్ ఇండియా టార్గెట్ గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ పొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని..వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా చిత్రీకరణను ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. 2027లో విడుదలయ్యే ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆమె అభిమానులకు ఆసక్తికరంగా మారింది. రష్మిక ఇప్పటికే హిందీలో ఫిమెల్ లీడ్ రోల్ గా వస్తున్న థామా, తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, మైసా, ఆట్లీ–ఆల్లు అర్జున్ సినిమా ఏఏ 22, పుష్పా 3 మూవీలతో బిజీగా ఉన్నారు.