Hrithik Roshan | నాటి బాలనటుడే…నేడు ‘కూలీ’తో బాక్సాఫీస్ ఫైట్

ఒకప్పుడు తలైవీ రజనీకాంత్ సినిమాలో ఆయన ఓ బాలనటుడు. అప్పటికే రజనీకాంత్ దేశంలోని టాప్ హీరోలలో ఒకడిగా..సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోగా ఉన్న రజనీకాంత్ ప్రధాన పాత్రలో..నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పెద్ద నటులతో నిర్మించిన కూలీ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్దమైంది. ఆ సినిమాతో పాటు అదే రోజు విడుదలవుతున్న వార్ 2 సినిమా కూడ బాక్సాఫీస్ వద్ధ ముఖాముఖీ తలపడుతుంది.

  • By: TAAZ |    cinema |    Published on : Aug 12, 2025 7:33 PM IST
Hrithik Roshan | నాటి బాలనటుడే…నేడు ‘కూలీ’తో బాక్సాఫీస్ ఫైట్

Hrithik Roshan | ఒకప్పుడు తలైవీ రజనీకాంత్ సినిమాలో ఆయన ఓ బాలనటుడు. అప్పటికే రజనీకాంత్ దేశంలోని టాప్ హీరోలలో ఒకడిగా..సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోగా ఉన్న రజనీకాంత్ ప్రధాన పాత్రలో..నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పెద్ద నటులతో నిర్మించిన కూలీ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్దమైంది. ఆ సినిమాతో పాటు అదే రోజు విడుదలవుతున్న వార్ 2 సినిమా కూడ బాక్సాఫీస్ వద్ధ ముఖాముఖీ తలపడుతుంది. వార్ 2లో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే ఇప్పుడు బడా హీరో రజనీకాంత్ సినిమా కూలీతో బాక్సాఫీస్ వద్ధ యుద్దం చేస్తున్న వార్ 2 సినిమాలోని హీరో హృతిక్ రోషన్ ఒకప్పుడు ఆయన సినిమాలో బాలనటుడి పాత్ర పోషించిన వాడే కావడం విశేషం. 2000 సంవత్సరంలో కహో నా…ప్యార్ హై సినిమాతో హృతిక్ రోషన్ హీరోగా అరంగేట్రం చేయడానికి ముందు, అతను అనేక చిత్రాలలో బాలనటుడిగా పనిచేశాడు. ఆషా, ఆప్ కే దీవానే వంటి సినిమాల్లో ఆయన నటించారు. 1986 లో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా హృతిక్ తాత జె.ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన భగవాన్ దాదాలో హృతిక్ చైల్డ్ అర్టిస్టుగా నటించారు. ఆ చిత్రంలో నటించినప్పుడు అతనికి కేవలం 10 సంవత్సరాలు. ఆ చిత్రంలో హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్, దివంగత నటి శ్రీదేవి కూడా నటించడం విశేషం. ఇటీవల హృతిక్ రోషన్ తన చిన్ననాట రజనీకాంత్ సినిమాలో నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి.. 

Citizenship Act 1955 | ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం రాదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అవుటర్ ఆదాయం..అవుటర్స్ కేనా..!
Movie Ticket Hike| తెలంగాణలో కూలీ, వార్-2 సినిమాల టికెట్ ధరల పెంపుపై రచ్చ..?