Citizenship Act 1955 | ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం రాదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత పౌరసత్వం విషయంలో బాంబే హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐటీని పొందినంత మాత్రాన భారతీయులు కాలేరని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడిన ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.

Citizenship Act 1955 | ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం రాదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Citizenship Act 1955 | భారత పౌరసత్వం విషయంలో బాంబే హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐటీని పొందినంత మాత్రాన భారతీయులు కాలేరని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడిన ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. బాబు అబ్దుల్‌ రౌఫ్‌ సర్దార్‌ అనే వ్యక్తి.. నకిలీ పత్రాలతో దశాబ్ద కాలంగా భారతదేశంలో నివసిస్తున్నాడు. భారత పౌరసత్వం చట్టంలో అంశాలను ఈ సందర్భంగా జస్టిస్‌ అమిత్‌ బోర్కర్‌ నేతృత్వంలో ధర్మాసనం ప్రస్తావించింది. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ వంటి డాక్యుమెంట్లు గుర్తింపు లేదా సేవలు పొందేందుకు మాత్రమే ఉపయోగపడతాయని తేల్చి చెప్పింది.

చెల్లుబాటు అయ్యే ఎలాంటి ప్రయాణ పత్రాలు లేదా చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన సర్దార్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత అక్రమ మార్గాల్లో ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఆఖరుకు భారతదేశ పాస్‌పోర్ట్‌ను సైతం పొందాడు. పౌరసత్వం పొందేందుకు సమగ్ర, శాశ్వత విధానాన్ని పేర్కొనే పౌరసత్వ చట్టాన్ని భారత పార్లమెంటు 1955లో ఆమోదించింది. దీన్ని ప్రస్తావించిన జస్టిస్‌ బోర్కర్‌ ‘ఈ రోజు భారతదేశంలో జాతీయత పై తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రధానమైనది, నియంత్రించేది అని నా అభిప్రాయం’ అని అన్నారు. ఎవరు భారతదేశ పౌరులో ఈ చట్టం నిర్ణయిస్తుందని చెప్పారు. అదే విధంగా భారత పౌరసత్వం ఎలా పొందాలో, ఏ సమయాల్లో పౌరసత్వం పోతుందో కూడా తెలియజేస్తుందన్నారు. ‘కేవలం ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ వంటి పత్రాలను చూపించినంత మాత్రాన వారు భారతదేశ పౌరులైపోరు’ అని స్పష్టంచేశారు. ఈ పత్రాలు గుర్తింపు కోసం, లేదా ఏదైనా సేవలు వినియోగించుకునేందుకు మాత్రమే పనికి వస్తాయని తెలిపారు. అంతేకానీ.. పౌరసత్వం చట్టం కింద పౌరసత్వాన్ని పొందేందుకు ఉన్న న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించి, వాటి ద్వారా పౌరులు కాలేరని ఆయన పేర్కొన్నారు.

చట్టబద్ధమైన పౌరులు, అక్రమ వలసదారుల మధ్య చట్టం స్పష్టమైన విభజన రేఖ గీసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ వలసదారులను అనేక మార్గాల ద్వారా భారత పౌరసత్వం పొందకుండా పౌరసత్వ చట్టం నిరోధిస్తున్నదని పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలన్న రౌఫ్‌ వాదనలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అతడికి బెయిల్‌ ఇస్తే అజా లేకుండా పోయే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి..

Frozen Love in Moscow: మాస్కోలో పెళ్లి రోజే మరణం వెనుక రహస్యం
Girl Molest | భ‌యంక‌ర ఘ‌ట‌న‌.. 14 ఏండ్ల బాలిక‌పై 200 మంది లైంగికదాడి..!
Love Marriages | ఈ మూడు తేదీల్లో జ‌న్మించిన వారికి.. ప్రేమ పెళ్లిళ్లు క‌లిసి రావ‌ట‌..!
Snake sleep on Flower | బంతి పువ్వుపై పడుకున్న ‘పాము’.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!