Sperm or egg donor । వీర్య/ అండ దాతల సంతానంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ఓ మహిళ.. తన మాతృత్వపు అనుభూతి (motherhood) కోసం పరితపించిపోయింది. తనకు గర్భధారణకు అవకాశాలు లేకపోవడంతో చెల్లిలి అండాన్ని దానంగా తీసుకుని, సరోగసి (surrogacy) ద్వారా కవలలను కన్నది

Sperm or egg donor । వీర్య/ అండ దాతల సంతానంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు

వారికి జీవసంబంధిత తల్లిదండ్రుల కాలేరని స్పష్టీకరణ

Sperm or egg donor । ఓ మహిళ.. తన మాతృత్వపు అనుభూతి (motherhood) కోసం పరితపించిపోయింది. తనకు గర్భధారణకు అవకాశాలు లేకపోవడంతో చెల్లిలి అండాన్ని దానంగా తీసుకుని, సరోగసి (surrogacy) ద్వారా కవలలను కన్నది. సీన్‌ కట్‌ చేస్తే.. మరదలి అండంతో జన్మించినందుకు వారు మరదలి పిల్లలేనని భర్త వాదించాడు. పిల్లలను తీసుకుని భర్త, మరదలు ఉంటున్నారు. పిల్లలను కలిసేందుకు కూడా తల్లిని అనుమతించడం లేదు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. వీర్య/ అండదాతలు తమ దానం కారణంగా జన్మించిన సంతానానికి జీవ సంబంధిత తల్లిదండ్రులు కాబోరని తేల్చి చెప్పింది. వారికి అందుకు చట్టపరమైన హక్కులు లేవని స్పష్టం చేసింది. తన ఐదేళ్ల కవల కుమార్తెలను కలుసుకునేందుకు సదరు 42 ఏళ్ల తల్లికి హక్కులు కల్పించింది.

అయితే.. తన మరదలు అండంతో జన్మించిన కారణంగా ఆ పిల్లలపై తన మరదలికే (legitimate right) హక్కు ఉంటుందని పిటిషనర్‌ భర్త వాదించాడు. ఆమె జీవపరమైన తల్లి అవుతుందని, తన భార్యకు ఆ కవలలపై ఎలాంటి హక్కు లేదని వాదించాడు. ఈ కేసును జస్టిస్‌ మిలింద్‌ జాదవ్‌ (Justice Milind Jadhav) ఏకసభ్య ధర్మాసనం విచారించింది. భర్త వాదనలతో విభేదించింది. పిటిషనర్‌ చెల్లెలు అండాన్ని దానం చేసినప్పటికీ ఆమె సదరు కవలలకు (twins) జీవ సంబంధిత తల్లి కాలేదని స్పష్టం చేసింది. తానే తల్లినని చెప్పుకొనే హక్కు లేదని పేర్కొన్నది. చెల్లెలి పాత్ర కేవలం అండ దాత వరకు మాత్రమేనని కోర్టు తెలిపింది. అంతకైతే స్వచ్ఛంద అండ దాత (voluntary donor), వంశపరంగా తల్లి మాత్రమే అవుతారని, కానీ, వారిపై చట్టబద్ధమైన హక్కులు పొందలేరని కోర్టు తీర్పు చెప్పింది.
సరోగసి (నియంత్రణ) చట్టం 2021 (Surrogacy (Regulation) Act 2021) అమల్లోకి రావడానికి ముందు 2018లో ఈ జంట సరోగసి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) (Indian Council of Medical Research (ICMR)) 2005లో జారీ చేసిన మార్గదర్శకాలు (guidelines) ఈ ఒప్పందాన్ని నియంత్రిస్తాయని ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు నియమితులైన అడ్వొకేట్‌ తెలిపారు.

ఆ మార్గదర్శకాల ప్రకారం.. సరొగేట్‌ తల్లి,

అండదానం చేసిన మహిళ అన్ని మాతృత్వపు హక్కులను కోల్పోతారని కోర్టు తీర్పు చెబుతూ.. ప్రస్తుత కేసులో కవల కుమార్తెలకు పిటిషనర్‌, ఆమె భర్త మాత్రమే తల్లిదండ్రులు అవుతారని స్పష్టం చేసింది.వీర్య/అండదాతలు మాతృత్వపు/పితృత్వపు హక్కులు లేదా విధులు కలిగి ఉండరని మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ చెల్లెలు కవలలకు తానే జీవ సంబంధ తల్లినని చెప్పుకొనే హక్కు లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.తాము సహజసిద్ధంగా తల్లిదండ్రులు (conceive) కాలేదని, తన చెల్లెలు స్వచ్ఛందంగా అండదానం (donate her eggs) చేసిందని పిటిషనర్‌ తెలిపారు. తన చెల్లెలి అండాన్ని, తన భర్త అండాన్ని ఫలదీకరణం చేసి, సరోగసి మహిళ (surrogate woman) గర్భంలో ప్రవేశపెట్టారు. ఆమె 2019 ఆగస్ట్‌ 19న కవలలకు జన్మనిచ్చింది. 2019 ఏప్రిల్‌లో చెల్లెలు, ఆమె కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి (road accident) గురయ్యారు. ఆ ప్రమాదంలో చెల్లెలి భర్త, కుమార్తె చనిపోయారు. ఆగస్ట్‌, 2019 నుంచి మార్చి 2021 వరకూ పిటిషనర్‌ తన భర్త, కవల పిల్లలతో కలిసి జీవించారు. ఇంట్లో తగాదాల (marital discord) నేపథ్యంలో తన భార్యకు చెప్పకుండా భర్త తన పిల్లలను తీసుకుని వేరొక ఇంటికి వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదం అనంతరం తన మరదలు మానసికంగా కుంగిపోయిందని, అప్పటి నుంచి తన ఇద్దరు కవల పిల్లలను చూసుకుంటూ తనతోనే జీవిస్తున్నదని పిటిషనర్‌ భర్త పేర్కొన్నాడు.

పిటిషనర్‌ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. తన కుమార్తెలను కలుసుకునేందుకు (interim visitation rights) అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక కోర్టునూ ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను 2023 సెప్టెంబర్‌లో స్థానిక కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన చెల్లెలు అండాలు మాత్రమే దానం చేసిందని, సరోగసి తల్లి కూడా ఆమె కాదని భార్య చెబుతున్నారు. కనుక కవల పిల్లలపై ఆమెకు ఎలాంటి చట్టపరమైన హక్కు లేదని వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. పై ఆదేశాలు జారీ చేయడంతోపాటు ప్రతివారాంతంలో మూడు గంటలపాటు తన కుమార్తెలను కలుసుకునేందుకు హక్కు కల్పించింది.