అవుటర్ ఆదాయం..అవుటర్స్ కేనా..!

ఓఆర్ఆర్ లీజు వివాదం.. రూ.7,000 కోట్లకే 30 ఏళ్ల లీజు, తెలంగాణకు రూ.25,000 కోట్ల నష్టం, కాంగ్రెస్ ఆరోపణలు వేడెక్కుతున్నాయి.

అవుటర్ ఆదాయం..అవుటర్స్ కేనా..!

లీజు రూ.7000వేల కోట్లు..తెలంగాణకు నష్టం రూ.25,000కోట్లు

విధాత, హైదారాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) ఆదాయం తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి కాకుండా లీజు పొందిన కాంట్రాక్టులకే వెలుతుందన్న ఆరోపణలకు నిదర్శనంగా కాంగ్రెస్(Congress) సోషల్ మీడియా ఆసక్తి కర లెక్కలు విడుదల చేసింది. 2025 తొలి ఆరు నెలల్లో ఓఆర్ఆర్ ఆదాయం రూ. 414 కోట్లు కాగా.. గత 16 నెలల మొత్తం ఓఆర్ఆర్ ఆదాయం రూ.1,100 కోట్లు. ఈ లెక్కన, 30 ఏళ్లలో ఓఆర్ఆర్ పై వచ్చే ఆదాయం రూ. 30,000 కోట్లకు పైగానే ఉండనుంది. అయితే గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రూ. 7,000 కోట్లకే 30 ఏళ్లపాటు ఓఆర్ఆర్ ను ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చింది. అంటే ఆ ప్రైవేటు సంస్థ పెట్టిన రూ.7,000 కోట్లు గరిష్టంగా 7 సంవత్సరాలోనే రికవరీ కానున్నాయి. మిగతా 23 ఏళ్ల ఆదాయం దాదాపుగా రూ.25,000 కోట్లు తెలంగాణ నష్ట పోతుండగా..ఆ మేరకు ఆ ప్రైవేటు సంస్థకు లాభంగా దక్కనుంది.

పార్టీ ఫండ్ కక్కుర్తితో క్విడ్ ప్రోకో చేస్తూ తెలంగాణ ఆస్తి ఓఆర్ఆర్ ను అప్పునంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేసిందని..తద్వారా ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయల విరాళాలు అందగా.. తెలంగాణకు దాదాపు రూ.25,000 కోట్ల నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. పదేళ్లు ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ఆదాయ వనరులను బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారంటూ ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి…

ఆస్తి కోసం నడిరోడ్డుపైనే కన్నతల్లిని నరికి చంపిన కొడుకు

మీ ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయిస్తున్న అదృశ్యశక్తులు ఏంటి?