Kaleshwaram Project| తుమ్మిడి హట్టి వద్దనుకుంటే.రూ.6100కోట్లు ఎందుకు ఖర్చు చేశారు: మంత్రి పొంగులేటి, జూపల్లి ప్రశ్న

Kaleshwaram Project| తుమ్మిడి హట్టి వద్దనుకుంటే.రూ.6100కోట్లు ఎందుకు ఖర్చు చేశారు: మంత్రి పొంగులేటి, జూపల్లి ప్రశ్న

విధాత, హైదరాబాద్ : తుమ్మిడి హట్టి వద్ధ నీళ్లు లేదనుకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ.6100కోట్లు ఎందుకు ఖర్చుచేసిందని మంత్రి పొంగులేటి మాజీ మంత్రి టి.హరీష్ రావును సూటిగా ప్రశ్నించారు. ఎలా లక్ష కోట్లు కొల్లగొట్టారు అన్నదే బీఆర్ఎస్ పాలకుల లక్ష్యం అని పొంగులేటి ఆరోపించారు. మీలా మాయ మాటలు చెప్పనని..ఆలైన్మెంట్ మార్పుతో మీ కుట్ర స్పష్టమవుతుందని విమర్శించారు. తుమ్మిడి హట్టిపై 8నెలలు ఆలోచించిన వారు మేడిగడ్డపై 25రోజులలో ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పొంగులేటి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ ఆ సమయంలో పొంగులేటి బీఆర్ఎస్ లోనే ఉన్నారని..బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు..పార్టీ మారితే తప్పు ఎలా అయ్యిందన్నారు. నీరు లేని చోటు నుంచి నీళ్లున్న చోటుకు మార్చి కాళేశ్వరం నిర్మించామన్నారు.

సీతారామ ప్రాజెక్టు అలైన్మెంట్ తప్పు అయితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. హరీష్ వ్యాఖ్యలపై పొంగులేటి మాట్లాడుతూ తాను ఆ సమయంలో బీఆర్ఎస్ లో లేనన్నారు. వ్యాప్కోస్ 11రోజుల్లో నివేదికపై డీపీఆర్ చేసుకుని టెండర్ కు వెళ్లారన్నారు. సీతారామ ప్రాజెక్టు యాడ్ లో ఉన్నానని, ట్వీట్టర్ లో కాళేశ్వరంను పొగిడానని పుక్కిటి పురాణాల మాదిరిగా మాట్లాడుతున్నారని.. మీలాగా తడిబట్టతో గొంతుకోసే రకం కాదన్నారు. తప్పులు చేసిన మీరు అన్ని మూసుకుంటే మంచిదన్నారు.  కాంక్రిట్ డయాఫ్రం వాల్ కట్టకపోవడంతోనే మేడిగడ్డ కూలిందన్నారు. ఏడో బ్లాక్ ప్రత్యేక టెక్నాలాజీ వాడలేదని..అధికారుల మాటను పాటించలేదని పొంగులేటి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికలు మూడు కూడా నిర్మాణంలో తప్పులు  జరిగాయని తేల్చాయన్నారు.  మామ చెప్పారు అల్లుడు పాటించారంటూ హరీష్ రావుపై సెటైర్లు వేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తుమ్మడి హట్టి వద్ధ నీళ్లులేవంటే మేడిగడ్డ వద్ధ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దానిపై హరీష్ రావు మాట్లాడుతూ సీడబ్ల్యూసీ ఇచ్చిన లెక్కలను ఉదహరించారు. అయితే జూపల్లి మాత్రం మేడిగడ్డ వద్ధ ఏ నది కూడా కలవనప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే నా సూటి ప్రశ్న అన్నారు. ఎర్రవాగు, పెద్దవాగులు తప్ప పెద్దగా నీటీ లభ్యత లేదని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీష్ తెలిపారు.