Crime News : ఆస్తి కోసం నడిరోడ్డుపైనే కన్నతల్లిని నరికి చంపిన కొడుకు
పి.గో జిల్లాలో ఆస్తి కోసం కొడుకు శివాజీ, కన్నతల్లి లక్ష్మీ నరసమ్మను నడిరోడ్డుపైనే కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం.
Crime News | అమరావతి : ఆస్తి కోసం కన్న తల్లినే ఓ కసాయి కొడుకు నడి రోడ్డుపై నరికి చంపిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఉమ్మడి ప.గో. జిల్లాలో కొయ్యలగూడెం అశోక్ నగర్ లో ఆస్తి కోసం కుమారుడు శివాజీ కత్తితో తన కన్న తల్లి లక్ష్మీ నరసమ్మ(44)పై దారుణంగాదాడి చేసి నరికేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి లక్ష్మినరసమ్మ మృతి చెందింది.
మృతురాలు లక్ష్మినరసమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. గతంలోనే ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఓ కొడుకు శివాజీ, కూతురు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహాం చేయగా..కొడుకు శివాజీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లక్ష్మినరసమ్మ సొంత ఇంటిని తనకు ఇవ్వాలని కొడుకు శివాజీ తరుచు ఆమెతో గొడవ పడుతున్నాడు. అంతకుముందు రెండుసార్లు తల్లిపై దాడికి యత్నించాడు. ఇరుగుపొరుగువారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. అయితే ఆదివారం ఇంటి సమీపంలో మరోసారి తల్లిపై దాడి చేసిన శివాజీ అమెను రోడ్డుపైనే నరికేశాడు. సమీపంలోని ఓ వ్యక్తి పరుగున అక్కడికి వచ్చి శివాజీని వారించడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన లక్ష్మినరసమ్మను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్తి కోసం తల్లిపై కన్న కొడుకు కత్తితో దాడి
ఉమ్మడి ప.గో. జిల్లాలో కొయ్యలగూడెం అశోక్ నగర్ లో ఆస్తి కోసం కుమారుడు శివాజీ కత్తితో తల్లి లక్ష్మీ నరసమ్మ(44)పై దారుణంగా దాడి చేశాడు l
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందింది. pic.twitter.com/bdSIrUN11r
— greatandhra (@greatandhranews) August 11, 2025
ఇవి కూడా చదవండి..
సివంగితో పులి స్నేహమా..!..ఎందుకలా..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram