Telugu Cinema| సినిమా షూటింగ్స్ బంద్ యథాతథం
విధాత : తమ వేతన డిమాండ్ల(Wage Dispute),కు నిర్మాతలు అంగీకరించని నేపథ్యంలో అన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్స్ బంద్ కొనసాగిస్తున్నట్లు(Telugu cinema, film shootings halt)గా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్(film federation strike) సోమవారం మరోసారి ప్రకటించింది. అన్ని రకాల షూటింగ్స్ బంద్ చేయాలని..ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలకి 2-3 రోజుల పాటు సమయం ఇస్తున్నట్లుగా తెలిపారు. వేతనాల పెంపుకు ఒప్పుకున్న నిర్మాతల షూటింగ్స్ కూడా ఆగాల్సిందే అని ఫెడరేషన్ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఫెడరేషన్ కార్మికులు సమ్మెతో ఎక్కువ కాలం సినిమా చిత్రీకరణలు నిలిచిపోతే.. అటు నిర్మాతలు, ఇటు ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇతర రాష్ట్రాల నుండి సాంకేతిక బృందం, అద్దెకు పరికరాలు తెచ్చకుంటే.. నిర్మాతలపై ఆర్థిక భారం పడే ఛాన్స్ ఉంది. సమస్య మరింత జఠిలం కాకుండా నేడు మరోసారి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు సమ్మెపై చర్చించనున్నారు. నేడు ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు భేటీ కాబోతున్నారు. నిర్మాతలు దిల్ రాజు, బన్ని వాసు, దానయ్య, , నాగవంశీ, బీవీఎస్ఎన్ ప్రసాద్ లు మంత్రితో చర్చలు జరుపనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram