సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం

సంక్రాంతి కానుకగా ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా (Bhairavi Ardhya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాటల్లో.. “రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. వీరు బావ–మరదలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతాం.” అని చెప్పారు.

నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం.” అని అన్నారు.

గ్రామీణ నేపథ్యంతో, ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న ‘కొత్త మలుపు’ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిత్ర వివరాలు:
నటీనటులు: ఆకాష్ (హీరో), భైరవి అర్థ్యా (హీరోయిన్), రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు
బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి
నిర్మాత: తాటి బాలకృష్ణ
సహ నిర్మాత: తాటి భాస్కర్
సంగీతం: యశ్వంత్
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్