Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామన్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే పుష్పతో తెగ రచ్చ చేసిన
Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామన్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే పుష్పతో తెగ రచ్చ చేసిన బన్నీ ఇప్పుడు మరోసారి అదే క్యారెక్టర్ లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రాబోతున్నారు. తొలి పార్ట్ కాసుల వర్షం కురిపించడంతో ఇప్పుడు పార్ట్ 2 ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మరింత సక్సెస్ సాధించాలనే పట్టుదలతో డైరెక్టర్ సుకుమార్ తగు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ మూవీని భారీ ఎత్తున ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.
అయితే మూవీకి సంబంధించి కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్, అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన టీజర్, రష్మిక మందన్న ఫస్ట లుక్ టీజర్ ప్రేక్షకులని తెగ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సాంగ్‌తో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో మొదటి భాగం సాంగ్స్ పెద్ద హిట్ కాగా, రెండో పార్ట్‌లో కూడా సాంగ్స్‌తో రచ్చ చేయబోతున్నాడు దేవి. అయితే సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ క్రేజ్ ఏర్పడడంతో ఇప్పుడు మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి హైప్ పెంచారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 ని.లకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఫుల్ సాంగ్ మే 1 ఉదయం 11.07 గంటలకు విడుదల కానుండగా, దీని కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్, జగదీప్ ప్రతాప్ బండారీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా… ఈ సినిమాను ఆగస్ట్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది.
One chant will resonate all over 💥#PushpaPushpa Lyrical Promo out now ❤️🔥
🎶 #Pushpa2FirstSingle firing on May 1st at 11.07 AM 🔥A Rockstar @ThisIsDSP Musical 🎵
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/5wKXOs5ZRG— Mythri Movie Makers (@MythriOfficial) April 24, 2024