అల్లు అర్జున్ విశ్వ‌రూపం.. టీజ‌ర్‌తో పిచ్చెక్కించాడుగా..!

  • By: sn    cinema    Apr 08, 2024 11:11 AM IST
అల్లు అర్జున్ విశ్వ‌రూపం.. టీజ‌ర్‌తో పిచ్చెక్కించాడుగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప‌2. తొలి పార్ట్ పెద్ద విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు రెండో పార్ట్‌పై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి. ఇక ఈ రోజు బ‌న్నీ బర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ టీజ‌ర్ విడుదల చేశారు. ఇందులో బ‌న్నీ లుక్ కేక పెట్టిస్తుంది. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా బ‌న్నీ క‌నిపిస్తున్నాడు. బ‌న్నీ అవ‌తారం చూసి అంద‌రు షాక్‌లో ఉన్నారు. ఈ సినిమా రికార్డ్‌లు తిర‌గ‌రాయడం ఖాయం అంటున్నారు. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ అందించిందని చెప్పాలి

టీజ‌ర్‌తో సెకండ్ పార్ట్ పుష్ప 2 ది రూల్ పై ఓ రేంజ్ అంచనాలు పెరిగాయి. ఇక వారం రోజులుగా పుష్ప 2 అప్డేట్స్‏తో.. పుష్పరాజ్ మేనియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే పుష్ప‌2కి సంబంధించి అనేక లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్ మాత్రం పిచ్చెక్కిస్తుంది. పుష్ప‌2 మానియా ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. అయితే బ‌న్నీకి సంబంధించి ఎలాంటి డైలాగ్ టీజ‌ర్‌లో లేక‌పోవ‌డం ఫ్యాన్స్‌ని డిజ‌ప్పాయింట్ చేస్తుంది. బ‌న్నీ లుక్, బాడీ లాంగ్వేజ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా అదిరిపోయాయి.ఇదిలాఉండ‌గా పుష్ప పార్ట్‌1 దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు అందులోని పాట‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ వ‌చ్చింది.

ఇప్పుడు పుష్ఫ‌2 ది రూల్ మ్యూజిక్‌పై అంత‌కుమించి అనేలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెర‌గ‌డంతో ఆ స్థాయిలోనే సంగీతం అందించేందుకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ క‌ష్ట ప‌డుతున్నాడు. డిసెంబర్ 17, 2021న ‘పుష్ప: ది రైజ్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నుంచి మరో సినిమా థియేటర్లలోకి రాక‌పోవ‌డంతో అంద‌రు పుష్ప‌2 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఆగ‌స్ట్ 15న థియేట‌ర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. నటుడిగా తనకు నేషనల్ అవార్డుతో పాటు ఎంతో పేరు తీసుకు వచ్చిన పుష్ప‌రాజ్ పాత్ర కోసం బ‌న్నీ చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. సుమారు రెండేళ్లుగా ఆయ‌న ఈ మూవీ కోసం హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. రష్యన్, జపనీస్, చైనీస్ భాషల్లో అనువదించే అవకాశం కూడా ఉంది.మొన్న‌టి వ‌ర‌కు బ‌న్నీ క్రేజ్ సౌత్‌కి మాత్రమే ప‌రిమితం అయింది. పుష్ప త‌ర్వాత ఆయ‌న క్రేజ్ ఎల్ల‌లు దాటింద‌నే చెప్పాలి.