Ram Charan| అనంత్ అంబాని కేర్ టేక‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్ కూతురికి కేర్ టేక‌రా..!

Ram Charan| జూలై 12న అనంత్ అంబాని వివాహం రాధికా మ‌ర్చంట్‌తో అట్ట‌హాసంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వివాహ వేడుక‌కి చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌రు కాగా, కేర్ టేక‌ర్‌గా ప‌ని చేస్తున్న నాని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న క‌ళ్ల ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవ‌డంతో నాని ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఆమె పూర్తి పేరు ల‌లితా డిసిల్వా కాగా, అనంత్ పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాల్లో నానీ ల‌లితా డిసిల్వా చాలా పోస్ట్‌లు

  • By: sn    cinema    Jul 20, 2024 7:51 PM IST
Ram Charan| అనంత్ అంబాని కేర్ టేక‌ర్ ఇప్పుడు చ‌ర‌ణ్ కూతురికి కేర్ టేక‌రా..!

Ram Charan| జూలై 12న అనంత్ అంబాని వివాహం రాధికా మ‌ర్చంట్‌తో అట్ట‌హాసంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వివాహ వేడుక‌కి చాలా మంది ప్ర‌ముఖులు హాజ‌రు కాగా, కేర్ టేక‌ర్‌గా ప‌ని చేస్తున్న నాని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న క‌ళ్ల ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవ‌డంతో నాని ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఆమె పూర్తి పేరు ల‌లితా డిసిల్వా కాగా, అనంత్ పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాల్లో నానీ ల‌లితా డిసిల్వా చాలా పోస్ట్‌లు పెట్టింది. నాని త‌న బేబీ కేర్ టేక‌ర్ ఉద్యోగం అంబాని ఇంటే ప్రారంభించింది. చిన్నతనంలో అనంత్ అంబానీని ద‌గ్గ‌రుండి చూసుకుంది కాబ‌ట్టి వారిరివురి న‌డుమ గొప్ప అనుబంధం ఉంది. అనంత్ చిన్న‌త‌నంలో చాలా మంచి కుర్రాడు, అత‌ను వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉంది. ఆ ఇద్ద‌రు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె త‌న పోస్ట్‌లో పేర్కొంది.

ల‌లితా డిసిల్వా.. తైమూర్ అలీ ఖాన్, క్లిన్ కారా కొణిదెల, అనంత్ అంబానీ స‌హా చాలామంది స్టార్ కిడ్స్ కి కేర్ టేక‌ర్‌గా ఉన్నారు. కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీ ఖాన్ మొదటి కుమారుడు తైమూర్‌తో రెగ్యుల‌ర్‌గా క‌నిపించ‌డంతో ఆమె అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇక కరీనా- సైఫ్ ల చిన్న కుమారుడు జెహ్‌కు కూడా ఆమె కేర్ టేక‌ర్‌గా ఉంది.. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన కామినేని దంప‌తుల‌ మొదటి బిడ్డ క్లిన్ కారా కొణిదెల సంరక్షణను ల‌లితా చూసుకుంటుంది.ఆమెకి జీతం భారీగానే ఇచ్చి క్లింకార సంర‌క్ష‌ణ‌ని చూసుకోమ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తుంది.

రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌తో బిజీ, మ‌రోవైపు ఉపాస‌న అపోలో మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈ క్ర‌మంలో నానీని వారు అపాయింట్ చేసుకున్నారు. ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు ముంబై వెళ్ల‌గా ఆ స‌మ‌యంలో ల‌లితా వారితో క‌నిపించింది. ఆమెకు ఇప్పుడు చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు నెల‌కు 1.5 ల‌క్ష‌ల జీతం కూడా చెల్లిస్తున్న‌ట్టు స‌మాచారం.ల‌లితా సావిత్రి.. షాహిద్ క‌పూర్- మీరా క‌పూర్ జంట కుమార్తెకు కూడా కేర్ టేక‌ర్‌గా పని చేశారు. ఇలా చాలా మంది సెల‌బ్రిటీల పిల్ల‌ల‌కి కేర్ టేకర్‌గా ప‌ని చేసిన ల‌లిత అంబాని ఇంట జ‌రిగిన పెళ్లిలో తెగ సంద‌డి చేసింది.సోష‌ల్ మీడియాలో అనంత్ అంబానికి కూడా సంబంధించి ప‌లు పోస్ట్‌లు పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.