Ram Charan|రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ కారు ఫ్యాన్సీ నెంబర్ ఏంటో తెలుసా..!
Ram Charan|మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ లగ్జరీ కారు రిజిస్టేషన్ కోసం చరణ్ ఖైరతాబాద్ లో ఆర్టీ
Ram Charan|మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ లగ్జరీ కారు రిజిస్టేషన్ కోసం చరణ్ ఖైరతాబాద్ లో ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ చేయించారు చరణ్. అయితే తే దాదాపు 7.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈ కారు(CAR)కి ఏ నెంబర్ వచ్చిందా అని అందరు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీంతో TG 09 2727 ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది అని తెలిసింది.

ఇక ఇప్పటికే చరణ్ దగ్గర ఫ్యాన్సీ నంబర్స్ తో చాలా కార్లే ఉన్నాయ్. అలా ఇప్పుడు చెర్రీ కార్ గ్యారేజ్ లో ఈ కార్ కూడా చేరింది. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో చరణ్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న అధికారులందరూ ఆయనతో ఫోటోలు దిగారు. ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా రోల్స్ రాయిస్ కారు ఉంది. కొందరు స్టార్ హీరోలు కూడా రోల్స్ రాయిస్ కారు కలిగి ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.
సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక త్వరలో బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా చేయనున్నారు చరణ్. ఈ మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. గత ఏడాది రామ్ చరణ్ హాలీవుడ్ కి వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా చరణ్ జమ్మూకశ్మీర్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం వెళ్లారు. అక్కడ హాలీవుడ్‌లో సినిమా చేయడం గురించి ప్రశ్న ఎదురైంది. దానికి చరణ్ స్పందిస్తూ.. ” నేను భారతదేశంలో చాలా సాదించాలి. నేను నా సంస్కృతికి కట్టుబడి ఉంటాను. మన భారతీయ భావాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలి. మన సంస్కృతి చాలా బలమైనది. మన కథల్లో చాలా గౌరవం ఉంటుంది. ఇండియన్ సినిమా గురించి. ఇక్కడి కథలు చెప్పాలి’ అని రామ్ చరణ్ అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram