Ram Charan|రానా వల్లే నేను సరిగా చదవుకోలేకపోయానంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
Ram Charan| ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్,

Ram Charan| ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు కారణం ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు దర్శకత్వంలో పలు సినిమాలు చేయనున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.రామ్ చరణ్‌కి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది. దగ్గుబాటి రానా కూడా అందులో ఒకరు. చరణ్ , రానా బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, వీళ్లిద్దరు క్లాస్ మెంట్స్ కూడా, ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో.. ఒకే క్లాస్ చదివారు.
రామ్ చరణ్, రానా చాలా సందర్భాల్లో తమ స్నేహం గురించి.. తాము చేసిన తుంటరి పనుల గురించి చెప్పుకురావడం మనం చూశాం. ఇక వీరి బ్యాచ్‌లో శర్వానంద్ కూడా ఉన్నారు. కొన్ని సందర్భాలలో తమ స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటూ.. ఒకరి సీక్రేట్ మరొకరు వెల్లడించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే రానా గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.రానా వలన తనకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయో రామ్ చరణ్ వివరించారు. రానా వల్ల చరణ్ కు చాలా తక్కువ మార్కులు వచ్చాయట. 8క్లాస్ నుంచి నుంచి నేను రానా కలిసి చదువుకున్నాము.. అయితే అప్పటి వరకూ నాకు బాగానే మార్కులు వచ్చేవి కాని.. ఆ తరువాత మార్కులు తగ్గాయి. అలా మార్కులు తగ్గడానికి రానానే కారణం అన్నారు చరణ్.
నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటే రానా నా ముందు కూర్చుంటే బోర్డ్ ఏం కనిపిచందు అని చెప్పేవాడిని అని రామ్ చరణ్ వివరించారు. ఇక రానా నా క్యారేజ్‌తో పాటు క్లాస్‌లో ఉండే చాలా మంది క్యారేజ్ తినేవాడు. అయితే రానా మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. అతను నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వంగా ఉందని రామ్ చరణ్ ఓ సందర్భంలో వివరించారు. రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రానా, రామ్ చరణ్ ఇద్దరు కూడా గ్లోబల్‌గా స్టార్‌డమ్ దక్కించుకోవడం మనం చూశాం. బాహుబలితో రానా క్రేజ్ విపరీతంగా పెరగగా, చరణ్‌కి ట్రిపుల్ ఆర్ సినిమాతో స్టార్‌డమ్ వచ్చింది