Phfi report | భారత్‌లో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు!.. పీహెచ్‌ఎఫ్‌ఐ నివేదికలో కీలక విషయాలు

భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. అందులో నిశ్శబ్ధంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఆత్మహత్య అనే భూతం. ప్రస్తుతం భారత్ లో రోజురోజుకు ఈ సమస్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా పురుషుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అనేక కారణాల వల్ల మహిళల కంటే పురుషులే ముందు వరుసలో ఉంటున్నారు.

Phfi report | భారత్‌లో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు!.. పీహెచ్‌ఎఫ్‌ఐ నివేదికలో కీలక విషయాలు

న్యూ ఢిల్లీ : భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. అందులో నిశ్శబ్ధంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఆత్మహత్య అనే భూతం. ప్రస్తుతం భారత్ లో రోజురోజుకు ఈ సమస్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా పురుషుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ విషయంలో అనేక కారణాల వల్ల మహిళల కంటే పురుషులే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ మేరకు పురుషుల ఆత్మహత్యలపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 15 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎక్కువగా బలవన్మరనాణాలకు పాల్పడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. పురుషుల ఆత్మహత్యలకు ఆర్థిక ఒత్తిడే ముఖ్య కారణం అని, మహిళలకు కుటుంబ సమస్యలు ప్రధాన కారణంగా ఉందని పీహెచ్ఎఫ్ఐ నివేదికలో పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం ఆత్మహత్యల వల్ల మరణించే వారి సగటు వయస్సు 36 ఏళ్లుగా ఉంది. ఇతర కారణాలతో చనిపోయే వారి కంటే ఆత్మహత్య చేసుకునే వారు సగటున 28 ఏళ్లు తక్కువ వయస్సు వారు ఉన్నారు. మహిళల సగటు వయస్సు 30 ఏళ్లు కాగా, పురుషులది 39 ఏళ్లుగా నమోదైంది.

తొమ్మిది రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా అధ్యయనం..

 

2019 నుంచి 2022 చివరి వరకు అసోం, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష మందికిపై గా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆత్మహత్యలపై సర్వే నిర్వహించింది. మొత్తం 2.4 లక్షల కుటుంబాల వివరాలు సేకరించగా అందులో 29,273 మరణాలను నమోదు చేశారు. భారత్ లో ఆత్మహత్యల రేటు 10 గా (లక్ష మందికి) ఉంది. పురుషుల్లో ఇది 12.8.. మహిళల్లో 7.3 గా ఉంది. అయితే, భారత జనాభా ఎక్కువగా
ఉండడంతో మొత్తం ఆత్మహత్యల సంఖ్య ప్రపంచలోనే అధికంగా ఉంది.

ఆత్మహత్యలకు కారణాణలు ఇవే..

పురుషులలో 18 శాతం ఆత్మహత్యలకు ఆర్థిక ఒత్తిడి కారణమైతే, మహిళలలో 33శాతం ఆత్మహత్యలు కుటుంబ సంబంధిత సమస్యలు వల్లనే జరుగుతున్నాయి. ఆర్థిక భారాలు, నిరుద్యోగం, అప్పులు, కుటుంబ పోషణ బాధ్యతలు పురుషుల బలవన్మరణాలకు ప్రధాన కారణాలుగా తేలాయి. అలాగే, మహిళల ఆత్మహత్యలకు ప్రధాన అంశాలుగా కుటుంబ గొడవలు, దాంపత్య హింస, వేధింపులు, కట్నం సమస్యలు గుర్తించారు. అయితే, సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్య సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. సమస్యలను ఎదుర్కొని వాటిని ఎలా పరిష్కరించాలో అనే కోణంలో ఆలోచించాలి తప్పా తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.