The Girlfriend Trailer : రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ట్రైలర్ రిలీజ్
రష్మిక మందానా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విధాత : నేషనల్ క్రష్ రష్మిక మందానా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘మనం చిన్న బ్రేక్ తీసుకుందామా..’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ‘ఎల్లుండే మూహుర్తం ఉందట..పెళ్లి చేసుకుందాం’ అంటూ హీరో చెప్పడం..అతను నీకు ఫెర్ ఫెక్ట్ కాదు అంటూ మరో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్ రష్మికతో అన్న డైలాగ్ లతో సినిమా ట్రయంగల్ ప్రేమకథలా సాగుతున్నట్లుగా కనిపించింది.
మధ్యలో స్పోర్ట్స్ డ్రామా..ఫ్యామిలీ డ్రామా..ఫైటింగ్ సీన్స్ తో సాగిన ట్రైలర్ చూస్తే.. మొత్తంగా ఈ సినిమా ప్రేమకథలో అనేక ట్వీస్టులు ఉన్నట్లుగా అనిపించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక కు జోడిగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram