Samantha|ఇతను సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం.. మరి ఎవరు ఇతను?
Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న సమంత వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే లేక లేడి ఓరియెంటెడ్ పాత్రలతో కూడా మెప్పించింది. అయితే సమంత స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉండగా, ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు అతనితో సఖ్యతగా ఉన్న ఈ అమ్మడు ఆ తర్వాత విభేదాల వలన విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి సమంత

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న సమంత(Samantha) వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే లేక లేడి ఓరియెంటెడ్ పాత్రలతో కూడా మెప్పించింది. అయితే సమంత స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉండగా, ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు అతనితో సఖ్యతగా ఉన్న ఈ అమ్మడు ఆ తర్వాత విభేదాల వలన విడాకులు ఇచ్చింది. అప్పటి నుండి సమంత సింగిల్‌గానే ఉంటుంది. 37 ఏళ్ళు దాటినా సమంతా తన ప్రేమాయణం,పెళ్లి గురించి నోరు మెదపకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. మయోసైటిస్ (Mayositis)బారిన పడిన సమంత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తోంది.
ఇటీవలే సొంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. మా బంగారం అనే టైటిల్‌తో సినిమా కూడా చేయనుంది.అయితే ఈ సినిమా పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ లేదు. కట్ చేస్తే ఇటీవల సమంతా ఒక యువకుడితో చేతులు కలిపి నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఒక పెళ్లిలో ఆ వ్యక్తితో సమంతా బయటకు వస్తున్న వీడియో వైరల్ కాగా, అతనితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు కనిపించింది. అయతే అతను సమంతా కొత్త ప్రియుడు అని, అతను ఎవరో తెలియదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దర్శిని సూర్య(Darshini Surya) అనే వ్యక్తి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అతను సమంతా స్నేహితుడని చెప్తున్నారు.
ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్లయిందని, అతను సమంతకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, చాలా ఏళ్లుగా వారిద్దరికీ మంచి స్నేహం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. అతని ఇంటి ఫంక్షన్‌కి వెళ్లి సమంతా తిరిగి వస్తున్నప్పుడు తీసిన వీడియో అని చెప్పారు. దీంతో సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ జరుగుతున్న ప్రచారంకి తెరపడింది. ఇక ఇదిలా ఉంంటే సమంత పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. అక్కడే కాలేజీ చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2010లో తమిళ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఆతరువాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయచేశావే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆ సినిమాలో తనతో నటించిన నాగ చైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.