27 Maoists Surrender In Chhattisgarh | ఛత్తీస్ గఢ్ లో మరో 27మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 17 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. వీరిపై మొత్తం ₹50 లక్షల రివార్డు ఉంది. పీఎల్‌జీఏకు చెందిన హార్డ్-కోర్ కమాండర్లు కూడా ఉన్నారు.

27 Maoists Surrender In Chhattisgarh | ఛత్తీస్ గఢ్ లో మరో 27మంది మావోయిస్టుల లొంగుబాటు

విధాత : మావోయిస్టు పార్టీకి వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బుధవారం రోజున మహారాష్ట్రలో సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ముందు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మరో 60మంది పీఎల్ జీఏ సాయుధ సభ్యులతో లొంగిపోయారు. అదే సమయంలో అటు చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మరో 27 మంది మావోయిస్టుల లొంగుపోవడం సంచలనం రేపింది. లొంగిపోయిన వారిలో 17 మంది పురుషులు, 10 మంది మహిళా మావోయిస్టలు ఉన్నారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

లొంగిపోయిన వారిపై రూ.50 లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ వెల్లడించారు. వారిలో రూ.10 లక్షల బహుమతితో ఒకరు, రూ. 8 లక్షల బహుమతితో ముగ్గురు, రూ.9 లక్షల బహుమతితో ఒకరు, రూ.2 లక్షల బహుమతితో ఇద్దరు, రూ.1 లక్ష బహుమతితో తొమ్మిది మంది ఉన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్-01 కు చెందిన ఇద్దరు హార్డ్-కోర్ కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కొన్నాళ్లుగా భద్రతా సంస్థల రాడార్‌లో ఉన్నారని, బస్తర్ ప్రాంతంలో హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వారిపై పెద్ద మొత్తంలో రివార్డులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.