Sri Reddy| వైసీపీ యువనేతతో శ్రీరెడ్డి సహజీవనం చేస్తుందా.. త్వరలోనే అతనితో పెళ్లి..!
Sri Reddy| శ్రీరెడ్డి... ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మీటూ ఉద్యమాన్ని ప్రారంభించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శన చేసి అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత శ్రీరెడ్డికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈమె వైసీపీని సపోర్ట్ చేస్తూ

Sri Reddy| శ్రీరెడ్డి… ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మీటూ ఉద్యమాన్ని ప్రారంభించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శన చేసి అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత శ్రీరెడ్డికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈమె వైసీపీని సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిడుతూ ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తన అసభ్య పదజాలంపై తరచుగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది.ఆమె చేసిన రచ్చకి ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో చెన్నైకి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. కొన్నాళ్లపాటు యూట్యూబ్ లో సందడి చేసింది. ఇప్పటికీ పలు వీడియోలు చేస్తూ హంగామా చేస్తుంటుంది.
అయితే శ్రీరెడ్డి వైసీపీకి విధేయంగా ఉంటూ టిడిపి, జనసేనపై ఆమె తీవ్ర విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే శ్రీరెడ్డి కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు ఏదో అడిగితే.. శ్రీరెడ్డి సిగ్గుపడుతూ.. ఈ విషయం తెలిస్తే.. బైరెడ్డి సిద్దార్థ్ నీ చేయి తీసేస్తాడంటూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో శ్రీరెడ్డికి, ఆ నేతకు ఏదైనా రిలేషన్ ఉందా? వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కర్నూల్ రాజకీయ నేత. కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఇతను గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్థర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
అయితే గత రెండేళ్లుగా శ్రీరెడ్డి అండ్ సిద్దార్థ్ సహజీవనంలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది.. సిద్దార్థ్ రెడ్డి ఇంట్లో శ్రీరెడ్డితో పెళ్లికి మొదట ఒప్పుకోక పోయిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా చెన్నైలోనే నివసిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ అయితే రావలసి ఉంది. కాగా, గతంలో శ్రీరెడ్డి.. దగ్గుబాటి అభిరామ్‌తో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోలు లీక్ చేసి ఎంత సంచలనం సృష్టించిందో మనం చూశాం.