Shruti Haasan| కమల్ హాసన్ గారాలపట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న శృతి హాసన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటీవల సలార్ చిత్రంతో మరో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ పరంగా ఈ అమ్మడు జోరు చూపిస్తున్నప్పటికీ పలు
Shruti Haasan| కమల్ హాసన్ గారాలపట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న శృతి హాసన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటీవల సలార్ చిత్రంతో మరో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ పరంగా ఈ అమ్మడు జోరు చూపిస్తున్నప్పటికీ పలు ఎఫైర్స్‌తో చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అర్ధమవుతుంది. శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి ఘాడమైన ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు కూడా చేయడం మానేసింది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఆమె లండన్‌కి వెళ్లి అక్కడే మకాం పెట్టింది . ఇక వారిద్దరి పెళ్లి కన్ఫాం అనుకున్న సమయంలో అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.
అయితే అతని నుండి విడిపోయిన తర్వాత శృతి హాసన్ కొంత డిప్రెషన్‌కి గురైంది. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి క్రాక్, వకీల్ సాబ్, సలార్ చిత్ర విజయాలతో తిరిగి ఫామ్ దక్కించుకుంది. మరోవైపు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తుంది. ఇందులో దాపరికం ఏమి లేదు. ఎప్పటికప్పుడు శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. కాని ఇటీవల ఎలాంటి అప్డేట్స్ లేవు. శృతి హాసన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేస్తే… అందులో డ శాంతను హజారికాను ఫాలో కావడం లేదు. అతడు కూడా ఇన్‌స్టాలో శృతిని అన్‌ఫాలో చేశాడు. మరోవైపు శాంతనుతో దిగిన ఫోటోలను శృతి హాసన్ డిలీట్ చేసింది. దీంతో వారిద్దరు విడిపోయారనే టాక్ ముంబైలో జోరుగా నడుస్తుంది.
శాంతనుతో కలిసి ఎక్కువగా తిరిగే శృథి హాసన్ ఇటీవల ‘హీరామండీ’ ప్రీమియర్ షోకి ఒంటరిగా వచ్చింది. అంతేకాదు అతని నుండి దూరమయ్యాక వేరే ప్లాట్‌లో సపరేట్గా ఉంటుందట. వారిద్దరు విడిపోయి దాదాపు నెల అయిందని టాక్. వారిద్దరి ప్రేమ కథకి అయితే ముగింపు పడిందని, అది ఎందుకు అనే దానిపై క్లారిటీ లేదని అంటున్నారు. ఇక శృతి హాసన్ ఇప్పుడు కెరీర్లో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. సలార్ 2లో ఆమె నటిస్తుంది. అలాగే అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ మూవీ రూపొందుతుండగా, అందులోను నటిస్తుంది.