ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. పటాస్ షోతో ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు రాగా, ఆ తర్వాత నుండి తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టార్ మాలో శ్రీముఖి దున్నేస్తుంది. దాదాపు ఫేమస్ షోస్ అన్నింటిలో కూడా శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ అదరగొడుతుంది. మరోవైపు సినిమాలలో కూడా సందడి చేస్తుంది. చిన్న హీరోల సినిమాతో పాటు స్టార్ హీరోల సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూ హంగామా చేస్తుంది. ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో మెరిసిన ఈ భామ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీముఖి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాదు హీరోయిన్‌గాను కనిపించి సందడి చేస్తుంది.
అయితే శ్రీముఖి బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. అప్పటి నుండే ఈ భామకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తృటిలో టైటిల్ కోల్పోయిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. అయితే రెమ్యూనరేషన్ రూపంలో భారీగా అందుకున్నట్టు సమాచారం. శ్రీముఖి బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత క్రేజీ అంకుల్ టైటిల్ తో విడుదలైన చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది.కాని శ్రీముఖి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే కొద్ది రోజులుగా శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. అయితే తన పెళ్లిపై ఎన్ని ప్రచారాలు నడిచిన శ్రీముఖి మాత్రం స్పందించడం లేదు.
శ్రీముఖి ఒక యంగ్ హీరోతో నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉందని, వీరు రహస్యంగా ప్రేమించుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. శ్రీముఖి ప్రేమ వ్యవహారం వారి కుటుంబ సభ్యులకి కూడా తెలుసట. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఏడాది చివర్లో సదరు హీరోతో శ్రీముఖి వివాహం చేసుకోనుందని అంటున్నారు.. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియా వర్గాల్లో మాత్రం ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. మరి ఆ యంగ్ హీరో ఎవరు అనే దాని గురించి అభిమానులు తెగ ఆరాలు తీస్తున్నారు. కాగా, ఓ సారి శ్రీముఖి తన పెళ్లి వార్తలపై మండి పడ్డారు. నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా చెబుతాను. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయోద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.