Sri Reddy| వైసీపీ యువనేతతో పెళ్లిపై ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి
Sri Reddy| సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే శ్రీరెడ్డి సరిగ్గా ఐదేళ్ల క్రిందట కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. ‘బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఒక్క రోజు పెళ్లంగా ఉంటే చాలు.. ఆ తరువాత చచ్చినా పర్లేదు.. నువ్వు మగాడివిరా బుజ్జీ

Sri Reddy| సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే శ్రీరెడ్డి సరిగ్గా ఐదేళ్ల క్రిందట కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. ‘బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఒక్క రోజు పెళ్లంగా ఉంటే చాలు.. ఆ తరువాత చచ్చినా పర్లేదు.. నువ్వు మగాడివిరా బుజ్జీ’ అంటూ శ్రీరెడ్డి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. పలు సందర్భాలలో కూడా బైరెడ్డి లాంటి మొగుడు నాకు కావాలంటూ కూడా కామెంట్ చేసింది శ్రీరెడ్డి. అయితే ఇప్పుడు అదే విషయంలో శ్రీరెడ్డిపై ట్రోలింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో తన ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.
రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే చేయండి కాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ బైరెడ్డి లాంటి యువ నాయకుడి జీవితం నాశనం చేయోద్దంటూ కోరింది శ్రీరెడ్డి.. ‘అంత ఖాళీగా ఉన్నారేంట్రా మీరు అని మొదలు పెట్టిన శ్రీరెడ్డి .. ఏంటి ఆ మీమ్స్. పనీ పాటా ఏం లేదా? ఏంటా మీమ్స్. మొన్నటివరకూ బీచ్‌లో బట్టలూడదీసి తిరుగుతానన్నానని ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను ఆమాటే చెప్పలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ఒకటి మొదలెట్టారు. ప్రతివాళ్లకీ నేనే హాట్ కేక్‌లా దొరుకుతాను. నేనేం అందగత్తెని కాదు. నేను పెద్ద ఇదేం కాదు కానీ.. అంతా నా మీద పడి ఏడుస్తారేంటో మరి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. ‘బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నా గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ అబ్బాయి నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అని. నేనేదో సరదాకి.. బైరెడ్డి బావుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది అన్నాను. కానీ.. నిజంగా నేనుప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ, అతడితో ఫోన్‌లో మాట్లాడటం కానీ చేయలేదు. బైరెడ్డి ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియనే తెలియదు’ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
‘నా జీవితం గురించి నాకు భయం లేదూ.. బాధా లేదూ. ఇలాంటివి వస్తే.. ఫ్యూచర్‌లో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు.. నా జీవితం అయ్యింది చాలు. ఇంకా అవ్వాల్సిందేమీ లేదు. కానీ, బైరెడ్డికి జీవితం ఉంది. అతను చిన్నపిల్లోడు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు. నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడుకాకూడదనే ఈ వీడియో చేస్తున్నా. ఆడదానికైనా, మగాడికైనా జీవితం అంటే ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదనే ఈ వీడియో చేస్తున్నా. బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడాలు, రిలేషన్‌షిప్‌లో ఉండటం లాంటివి లేవు. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి’.. అబద్దాలతో ఫేక్ ప్రచారాలను చేయొద్దు’ అంటూ శ్రీరెడ్డి కూల్ వార్నింగ్ ఇచ్చింది.