Sukumar| లెక్కల మాస్టారు సుకుమార్ చాల కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుంటూ పోతారు. అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. రంగస్థలం సినిమాలో సుకుమార్ చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కి ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుండి సుకు
Sukumar| లెక్కల మాస్టారు సుకుమార్ చాల కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుంటూ పోతారు. అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. రంగస్థలం సినిమాలో సుకుమార్ చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కి ఎంతో మంది ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుండి సుకుమార్ సినిమాలని ఫాలో అవుతూ వచ్చారు. పుష్ప చిత్రంని పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప2 పైనే ఉంది. ఆగస్టు 15న రిలీజ్ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కారణాలు ఏవైన ఈ మూవీ నాలుగు నెలల పాటు వాయిదా పడి ఫ్యాన్స్‌ని నిరాశపరచింది.
అయితే మూవీ కోసం సుకుమార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమాని చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంతో కూల్‌గా ఉండే సుకుమార్ ఓ సారి కోపంతో తన ఐఫోన్ నేలకేసి కొట్టారట. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల మీడియా ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది. అయితే సుకుమార్ కోపానికి కారణం ఏంటంటే.. సినిమాలో వచ్చే కీలకమైన సీన్లో భాగంగా సిండికేట్ మెంబర్స్ మీటింగ్ ఉంటుంది. దానికి సంబంధించి 40 రీటేక్స్ చేశారు. ఒకరు బాగా చేస్తే మరొకరు తప్పు చేస్తున్నారు.వారి పర్ఫార్మెన్స్కి చిరాకుతో సుకుమార్ తన ఐఫోన్‌ని కోపంతో నేలకేసి కొట్టి సెట్స్ నుండి వెళ్లిపోయారట. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పుష్ప2 సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సుకుమార్ అహోరాత్రులు కృషి చేస్తున్నాడు. తన టెక్నిషియన్స్, టీమ్ నుంచి కూడా అదే సుకుమార్ కోరుకుంటుండగా, కొందరు దానికి సహకరించకపోవడంతో సుకుమార్‌కి ఆగ్రహం వచ్చేస్తుంది. పుష్ప చిత్రం బడా హిట్ కొట్టడంతో ఇప్పుడు పుష్ప2ని అంతకు మించేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ తను అనుకున్నది తెరపై వచ్చేదాకా కష్టపడుతూ ఉంటారు. పుష్ప2 విషయంలో క్వాలిటీ కాస్త తేడా కొట్టడంతో మూవీని మరి కొద్ది రోజులు డిలే చేశారని టాక్ నడుస్తుంది. ‘పుష్ప-2’ వర్కింగ్ డేస్ ఇప్పటికే 300 రోజులు దాటిపోగా,ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే దానిపై క్లారిటీ లేదు. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి.