Committee Meeting On Film Workers Isuue | సినిమా కార్మికుల సమస్యలపై కమిటీ తొలి భేటీ
సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం లేబర్ కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో దిల్ రాజు, సుప్రియ, దామోదర ప్రసాద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, సంక్షేమంపై చర్చించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
విధాత, హైదరాబాద్ : సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం లేబర్ కమిషనర్ ఆఫీస్‌లో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. అడిషనల్ కమిషనర్ గంగాధర్ సమక్షంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రొడ్యూసర్ సుప్రియ, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై చర్చించారు.
ఈ సమావేశం నిర్వహణతో తెలుగు చలన చిత్ర పరిశ్రమంలో పనిచేసే వేలాది మంది కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, భద్రత వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆయా అంశాలపై చర్చించి, ప్రభుత్వానికి అతి త్వరలో సమగ్ర నివేదిక అందించనున్నట్లుగా అడిషనల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram