Thama Teaser : ‘థామా’తో రష్మిక అదరగొట్టేసింది..!
రష్మిక అదరగొట్టిన ‘థామా’ టీజర్ విడుదల! రొమాంటిక్ హారర్, మిస్టరీ, థ్రిల్లర్, దీపావళీకి ప్రేక్షకుల ముందుకు.

Thama Teaser | విధాత: నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన ప్రాత్రలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపుదిద్దకుంటున్న ‘థామా’సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. రష్మిక-ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న థామా సినిమా అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ హారర్..మిస్టరీ.. కామెడీ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. సినిమా కథకు తగ్గట్లుగానే ప్రేక్షకులను భయపెడుతూ..హర్రర్..సస్పెన్స్..రోమాంటిక్ సన్నివేశాలతో టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.
టీజర్ లో రష్మిక నటించిన సన్నివేశాలు చూస్తే నటనలో మరో మెట్టుపైకెక్కినట్లుగా వినూత్న పాత్రలో కనిపించి అమె అభిమానులను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. దెయ్యం పాత్రలో రష్మిక అదరగొట్టింది. టీజర్ లో రష్మిక లిప్ లాక్ కూడా చూపించడం సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ‘థామా’ ఈ దీపావళీకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.