The Girlfriend | రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌ విడుదల తేదీ ఫిక్స్

రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

The Girlfriend | రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌ విడుదల తేదీ ఫిక్స్

విధాత : నేషనల్ క్రష్ రష్మిక తన ప్రియుడు హీరో విజయ్ దేవరకొండతో తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఫ్రిబవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్. ఇది ఇలా ఉంటే..వరుస సినిమాలతో అగ్రతారగా దూసుకెలుతున్న రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన మేకర్స్ ఈ సందర్భంగా ఓ వీడియో పోస్టు చేశారు. అల్లు అరవింద్‌ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దీక్షిత్‌శెట్టి నటిస్తున్నారు.

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ కంటే ముందుగా రష్మిక లీడ్ రోల్ లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘థామా’ ఈ ఆక్టోబర్ 21న విడుదల కానుండం విశేషం. అంటే రెండు వారాల గ్యాప్ లో రష్మిక రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం రష్మిక థామా, ది గర్లఫ్రెండ్ సినిమాలతో పాటు ఆర్జున్ ఆట్లీ, అలాగే ‘పుష్ప 3: ది ర్యాంపేజ్, మైసా, రెయిన్‌బో’, ‘కాక్‌టెయిల్’ సీక్వెల్‌ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది.