Weather Update | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు:వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Weather Update | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు:వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది.

శనివారంనాడు మహబూబ్ నగర్,వికారాబాద్,హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, ములుగు, ఆదిలాబాద్‌, నిజామాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, , కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక నుంచి కొమోరిన్‌ ప్రాంతం వరకు తమిళనాడు అంతరభాగంగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది.

సోమవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. మంగళవారం వరంగల్,హన్మకొండ, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, సూర్యాపేట, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.