Rajagopal Reddy : లిక్కర్ పాలసీని ప్రభుత్వం సమీక్షించాలి

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ పాలసీపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని, వెంటనే సమీక్షించాలని డిమాండ్ చేశారు.

Rajagopal Reddy : లిక్కర్ పాలసీని ప్రభుత్వం సమీక్షించాలి

విధాత : సొంత పార్టీ ప్రభుత్వంపైన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.
ప్రజారోగ్యానికి సవాల్ గా మారిన లిక్కర్ పాలసీని ప్రభుత్వం సమీక్షించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నాకు పదవి ముఖ్యం కాదని..ప్రజారోగ్యం, ప్రాణాలు ముఖ్యమన్నారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని..ఇందుకోసం లిక్కర్ పాలసీని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. వైన్స్ టెండర్లు వేసేవారికి తాను ముందే చెబుతున్నానని..నా నియోజకవర్గంలో పర్మిట్ రూమ్ లను అనుమతించేది లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఊరి పొలిమేరలలో ఉండాల్సిన మద్యం దుకాణాలు ఊర్లలోకి వస్తున్నాయన్నారు. మద్యం దుకాణాల లోకేషన్స్ కూడా తప్పుగా ఉన్నాయన్నారు. బెల్ట్ షాపులకు సరుకు అమ్మవద్దంటే అమ్ముతున్నారని..పైగా వ్యాపారులు సిండికేట్ అవుతూ..ధరలు పెంచుతున్నారని, నకిలీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. వేరే మండలాలు, జిల్లాల వారు నా నియోజకవర్గంలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు టెండర్లు వేయవద్దన్నారు.