Komatireddy Rajgopal Reddy| జనం కోసమే మా ఫౌండేషన్ : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు
మునుగోడు ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎలాంటి సేవా, సహాయ కార్యక్రమాలకైన సిద్దంగా ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి దంపతులు స్పష్టం చేశారు. ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు 1 కోటి 50 లక్షలు వెచ్చించిన మర్రిగూడ మండల కేంద్రంలో నిర్మించిన కస్తూరిబా బాలికల పాఠశాల భవనాన్ని వారు ప్రారంభించారు.
విధాత : మునుగోడు(Munugode) ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్(Komatireddy Suseelamma Foundation) ఎలాంటి సేవా, సహాయ కార్యక్రమాలకైన సిద్దంగా ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy), లక్ష్మి(Lakshmi) దంపతులు స్పష్టం చేశారు. ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు 1 కోటి 50 లక్షలు వెచ్చించిన మర్రిగూడ మండల కేంద్రంలో నిర్మించిన కస్తూరిబా బాలికల పాఠశాల భవనాన్ని వారు ప్రారంభించారు. 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ వంటి అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించి పాఠశాల నిర్వహణకు అప్పగించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ విద్య, వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాలతో పాటునియోజకవర్గంలో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తాం అని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారు అన్నారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారని.. సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని తెలిపారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆశ్రమపాఠశాలల దుస్థితి చూడలేక కస్తూరిబా పాఠశాలకు సొంతనిధులతో భవనాన్ని నిర్మింపచేశానన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం అన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారని, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని నా దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram