ANR|ఐసీయూలో ఉండి ఆడియో సందేశం పంపిన అక్కినేని.. విన్న త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు ఎమోష‌న‌ల్

ANR|అతి చిన్న వ‌య‌స్సులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగారు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. సినిమా హీరోగా 67 వసంతాలు.. నిజ జీవితంలో 87 వసంతాలు, రంగస్థల నటుడిగా 82 వసంతాలు, సినీ అగ్రనటుడిగా 71 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీరంగ ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరావు. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవపురంలో అనే మారుమూల పల్లెలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మి

  • By: sn    cinema    Oct 29, 2024 4:24 PM IST
ANR|ఐసీయూలో ఉండి ఆడియో సందేశం పంపిన అక్కినేని.. విన్న త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు ఎమోష‌న‌ల్

ANR|అతి చిన్న వ‌య‌స్సులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగారు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు(ANR). సినిమా హీరోగా 67 వసంతాలు.. నిజ జీవితంలో 87 వసంతాలు, రంగస్థల నటుడిగా 82 వసంతాలు, సినీ అగ్రనటుడిగా 71 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీరంగ ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరావు. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవపురంలో అనే మారుమూల పల్లెలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించారు అక్కినేని. అయితే ఆయ‌న క‌న్నా ముందు పుట్టిన న‌లుగురు పురిటిలోనే క‌న్నుమూసారు. దాంతో అక్కినేని(Akkineni) మీద కూడా ఆశ‌లు వ‌దులుకుంది ఆయ‌న త‌ల్లి. అయితే అక్కినేని త‌ల్లి పున్న‌మ్మకి క‌ల‌లో త‌న బిడ్డ చుట్టూ ఓ నాగుపాము మూడు సార్లు తిర‌గ‌డం కనిపించింద‌ట‌.

అప్పుడు ‘తండ్రీ నాగేంద్ర నా బిడ్డను కాపాడు.. దీర్ఘాయుషునిగా దీవించు.. నీ పేరే పెట్టుకుంటా’అని మొక్కుకున్నారు. అలా తన బిడ్డ బతకడానికి ఆ మొక్కే కారణమని నమ్మిన పున్నమ్మ కొడుకుకి ‘నాగేశ్వరరావు’ అని నామకరణం చేశారు. ఆడపిల్లలు లేని పున్నమ్మ నాగేశ్వరరావుని ఆడపిల్లగా అలంకరించి ‘నా కూతురు’ అంటూ ఆ ముద్దు తీర్చుకునేవారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన అక్కినేని క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసారు. అయితే గ‌త రాత్రి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ప్రదానోత్సవం అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హాజరయ్యారు. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేశారు.

ఇక కార్య‌క్ర‌మం చివ‌ర‌ల అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఐసీయూ నుండి మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని వినిపించారు. “నా శ్రేయాభిలాషులు అంద‌రూ నా ప‌ట్ల ఎంత శ్ర‌ద్ధ‌వ‌హిస్తున్నారో, నా ఆరోగ్యం గురించి ఎంత ఆరాట ప‌డుతున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియ‌జేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను. రిక‌వ‌రీ అవుతున్నాను. ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీ అంద‌రి ఆశీర్వాద బ‌లం ఉంద‌ని నాకు తెలుసు. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు.” అంటూ నాగేశ్వ‌ర‌రావు తెలియ‌జేశారు. అయితే ఆ స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), న‌టి ర‌మ్య‌కృష్ణ‌తో పాటు అక్క‌డ ఉన్న అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.