War 2 Song “Aavan Jaavan” | యువతను ఉర్రూతలూపుతున్న ‘వార్ 2’ సాంగ్
హృతిక్ రోషన్, కియారా అడ్వాణీ జంటపై చిత్రీకరించిన ‘వార్ 2’ లోని ‘అవాన్ జవాన్’ పాట యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. చంద్రబోస్ రాసిన తెలుగు వెర్షన్ కూడా ఆకట్టుకుంటోంది. సాంగ్‌లోని బోల్డ్ సీన్స్, స్టైలిష్ లుక్స్ పాటకు వైరల్ హవా తీసుకొచ్చాయి.

War 2 Song “Aavan Jaavan” | విధాత: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’ నుంచి తాజాగా విడుదలైన పాట యువతను ఉర్రూతలూపుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన వార్ 2 మూవీ నుంచి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇస్తూ యూ ట్యూబ్ వేదికగా గురువారం హిందీలో ‘అవాన్ జవాన్’ అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగులో నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తుపోతుంటావు ఊపిరి ఊయలగా..అంటూ సాగే సాటను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను శశ్వాంత్ సింగ్, నిఖితా పాడారు. పాట ఆన్ స్క్రీన్ లో హీరో హీరోయిన్లు హృతిక్ రోషన్..కియారా అడ్వాణీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
ముద్దు సన్నివేశాలతో వారిద్దరు రెచ్చిపోయారు. పాట మధ్యలో వచ్చే కియారా బికినీ సన్నివేశాలు యూత్ ను నిద్ర లేకుండా చేసేవిగా ఉన్నాయి. హృతిక్ స్టైలిష్ లుక్.. కియారా అందాలతో ఆకట్టుకుంటున్నారు. దీంతో పాట విడుదలైన గంటల్లోనే భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆగస్టు 14న వార్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది.