డబ్బు, నగలతో 12 మంది నవ వధువులు పరార్!..‘కర్వా చౌత్’ నాడు యూపీలో ఘటన
ఉపవాసం ఉండి, వారి కుటుంబాలకు మత్తు పదార్థాలు కలిపిన ఆహారాన్ని వడ్డించారని ఆరోపణలు ఉన్నాయి. కుటుంబీకులు స్పృహ కోల్పోయాక నవ వధువులు రాత్రి వేళ ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదుతో పారిపోయారు.
విధాత, ఉత్తరప్రదేశ్ : పెళ్లి కానీ యువకులే టార్గెట్ గా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ అమ్మాయిలను ఎరగా వేసి మోసానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో 12 మంది నవ వధువులు రూ.30 లక్షలకు పైగా విలువైన నగలు, నగదుతో పారిపోయారు. ‘కర్వా చౌత్’ పండగ నాడు సదరు మహిళలు ఉపవాసం ఉండి, వారి కుటుంబాలకు మత్తు పదార్థాలు కలిపిన ఆహారాన్ని వడ్డించారని ఆరోపణలు ఉన్నాయి. కుటుంబీకులు స్పృహ కోల్పోయాక నవ వధువులు రాత్రి వేళ ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదుతో పారిపోయారు. దీంతో మరుసటి రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాహాలలో ఎక్కువ భాగం బ్రోకర్ల ద్వారానే కుదిరాయని పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram