UP | కాబోయే అల్లుడితో.. అత్త పరార్ !

UP | కాబోయే అల్లుడితో.. అత్త పరార్ !

విధాత: కాబోయే అల్లుడితో ఓ అత్త పరారైన సంఘటన సంచలనం రేపింది. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగిన ఈ ఘటన సమాజంలో రోజురోజుకు కలుషితమవుతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. అలీగఢ్‌ లోని మద్రాక్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన కూతురి పెళ్లి కోసం స్వయంగా ఓ యువకుడిని చేసి పెళ్లి నిశ్చయం చేసింది. అబ్బాయి కూతురుకి నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాయి. ఏప్రిల్ 16న పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశారు. బంధువులు, స్నేహితులకు ఆహ్వానపత్రికలు కూడా పంచేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం తరచూ అల్లుడు అత్తవారింటికి వచ్చే వాడు. ఈ క్రమంలో కాబోయే అల్లుడితో అత్త ప్రేమలో పడింది. అబ్బాయికి కూడా ఆమె నచ్చడంతో ఇక ఇద్దరూ ప్రేమాయణం సాగించారు. ఆ పెళ్లి కుమారుడు కాబోయే అత్త కోసం ఏకంగా కొత్త ఫోన్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు.

అయితే ఆ పెళ్లి జరిగితే విడిపోవాల్సి వస్తుందని.. కలిసి ఉండటం కుదరదని నిశ్చయించుకున్న ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయేందుకు పథకం వేసుకున్నారు. పెళ్లికి ఇంకా తొమ్మిది రోజులు ఉందనంగా షాపింగ్ కోసం వెళ్తున్నానని చెప్పి పెళ్లి కోసం చేయించిన నగలు, డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయారు. షాపింగ్ కోసమని వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో ఇరు కుటుంబాలకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు వరుడి తల్లిదండ్రులు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టి బరువు దించుకోవాల్సిన తల్లి అతడితోనే లేచిపోయిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజం అధునిక పోకడలు పోతున్న కొద్ధి మానవ సంబంధాలు కలుషితమవుతున్నాయని.. ముఖ్యంగా పాశ్చత్త సంస్కృతి ప్రభావమో..పెరిగిన సాంకేతికత పరిజ్ఞానంలోని అశ్లీలత ప్రభావమోగాని మనుషులు వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.