Love Affair | భర్త వద్దే వద్దు.. అల్లుడే ముద్దు.. అంటోంది ఆ అత్త..!
Love Affair | తనకు తాగుబోతు భర్త( Husband ) వద్దే వద్దు.. అల్లుడే( Son in Law ) ముద్దు అంటోంది ఆ అత్త. అదేనండీ పది రోజుల క్రితం బిడ్డ( Daughter )కు కాబోయే భర్త( Fiance )తో లేచిపోయిన అత్త ప్రేమకథా( Love Affair ) ఇదీ..!
Love Affair | లక్నో : భర్త( Husband ) వద్దే వద్దు.. అల్లుడే( Son in Law ) ముద్దు.. అంటోంది ఓ అత్త( Mother in Law ). భర్తతో నిత్యం నరకం అనుభవిస్తున్నానని.. అందుకే అల్లుడిని పెళ్లి( Marriage ) చేసుకోవాలనుకుంటున్నానని చెబుతోంది ఆ అత్త. ఏదేమైనా.. తాగుబోతు భర్తను వదిలేసి అల్లుడితోనే కాపురం చేస్తానంటోంది ఆమె. ఇదంతా పది రోజుల క్రితం.. బిడ్డకు కాబోయే భర్త( Fiance )తో అంటే అల్లుడితో లేచిపోయిన అత్త ప్రేమకథా( Love Affair ) ఇదీ..!
సరిగ్గా పది రోజుల క్రితం.. ఏప్రిల్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని అలీఘర్‌కు చెందిన ఓ వివాహిత( Married Woman ) తన బిడ్డకు కాబోయే భర్తతో లేచిపోయిన సంగతి తెలిసిందే. అయితే అత్త సాప్నా( Sapna ).. తన అల్లుడు రాహుల్( Rahul )తో కలిసి పోలీసుల ఎదుట ఏప్రిల్ 16న లొంగిపోయింది. ఈ సందర్భంగా పోలీసులకు సాప్నా ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
తన భర్త రోజు వేధింపులకు గురి చేస్తూ.. మద్యం మత్తులో చేయి చేసుకుంటున్నాడని పోలీసులకు సాప్నా తెలిపింది. తాగుబోతు భర్త తనకు వద్దని తెగేసి చెప్పింది. తాగొచ్చి కొట్టడం కారణంగానే రాహుల్‌తో లేచిపోయానని పేర్కొంది. ఏం జరిగినా సరే.. తాను రాహుల్‌నే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది సాప్నా. ఇక మిగిలిన జీవితం రాహుల్‌తోనే గడపాలని ఉందని చెప్పింది.
చనిపోతానని బెదిరించినందుకే..
తనను పెళ్లి చేసుకోకపోతే.. కలిసి జీవించలేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినందుకే సాప్నాతో వెళ్లాల్సి వచ్చిందని రాహుల్ కుమార్ తెలిపాడు. చేసేదేమీ లేక అలీఘర్ బస్టాప్‌లో కలుసుకుని, అక్కడ్నుంచి లక్నో వెళ్లామని చెప్పాడు. లక్నో నుంచి ముజఫర్‌పూర్ వెళ్లినట్లు రాహుల్ పేర్కొన్నాడు. సాప్నాను ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్న మాట వాస్తవమేనని రాహుల్ చెప్పాడు. సాప్నాను పెళ్లి చేసుకునేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని రాహుల్ పోలీసులకు తెలిపాడు.
సాప్నా మాకు అవసరం లేదు..
ఇక సాప్నా ఇంట్లో నుంచి రూ. 5 లక్షల నగదు, రూ. 3.5 లక్షల నగదును తీసుకొని పారిపోయిందని భర్త, కూతురు ఆరోపించారు. తాను కేవలం ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తన వద్ద మొబైల్ ఫోన్, రూ. 200 మాత్రమే ఉన్నాయని సాప్నా పేర్కొంది. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం.. సాప్నా తమకు అవసరం లేదని.. కేవలం బంగారు ఆభరణాలు, నగదు ఇస్తే సరిపోతుందని చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram