పోలీసులకే టోకరా వేస్తున్న సైబర్ నేరగాళ్ళు

విధాత:సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు, వీరు అని లేదు అన్ని వర్గాలపై పంజా విసురుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. పోలీసు కుటుంబాలను సైతం విడువడం లేదు. తాజాగా హైదరాబాద్ నారాయణగూడ సీఐ భార్యకు#8230;.. భారీగా టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయలు విలువ చేసే చీరను#8230; సీఐ భార్య ఆర్డర్‌ చేశారు. తీరా వచ్చిన పార్శిల్‌లో చీర లేకపోవటంతో#8230;.. గూగుల్‌లో వెతికి సంబంధింత కంపెనీ కస్టమర్ కేర్ నంబరు తెలుసుకొని ఫోన్ చేశారు. ప్యాకింగ్‌లో […]

పోలీసులకే టోకరా వేస్తున్న  సైబర్ నేరగాళ్ళు

విధాత:సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు, వీరు అని లేదు అన్ని వర్గాలపై పంజా విసురుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. పోలీసు కుటుంబాలను సైతం విడువడం లేదు. తాజాగా హైదరాబాద్ నారాయణగూడ సీఐ భార్యకు#8230;.. భారీగా టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయలు విలువ చేసే చీరను#8230; సీఐ భార్య ఆర్డర్‌ చేశారు. తీరా వచ్చిన పార్శిల్‌లో చీర లేకపోవటంతో#8230;.. గూగుల్‌లో వెతికి సంబంధింత కంపెనీ కస్టమర్ కేర్ నంబరు తెలుసుకొని ఫోన్ చేశారు. ప్యాకింగ్‌లో మిస్టేక్ జరిగిందన్న అవతలి వ్యక్తి#8230; డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి#8230;బ్యాంక్ అకౌంట్ నంబరు తెలుసుకొని క్యూఆర్​ కోడ్ పంపించాడు.ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే#8230;.

45 వేలు కట్ అయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ # 8230 ; మరో కోడ్ పంపించాడు. ఇలా మూడు సార్లు ఆమె అకౌంట్ నుంచి 59 వేలు కొట్టేశాడు. అర్థమైందిగా.. మీ ఫోన్‌కి ఏదైనా లింక్‌ వచ్చినా #8230;? డబ్బులు పంపించాలంటూ ఎవరైనా QR కోడ్‌ పంపించినా #8230;? లేదా ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కోసం గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్ సెర్చ్ చేస్తున్నా #8230;? అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా #8230; మీ ఖాతాలో సొమ్ము స్వాహా చెయ్యడానికి కంత్రీగాళ్లు కాచుకు కూర్చున్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు.. ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.